
PM Awas Yojana: తమ కంటూ ఒక సొంతిల్లు కట్టుకోవాలనేది ప్రతీఒక్క సామాన్యుడి కల. ఈ కలను నెరవేర్చుకునేందుకు కాయాకష్టం చేసి డబ్బులు పొగు చేసుకుంటారు. సిమెంట్, ఇసుక, ఇనుము లాంటి ధరలన్నీ అధికం కావడంతో ఇప్పట్లో ఇల్లు నిర్మించుకోవాలంటే లక్షలకు లక్షలకు వెచ్చించాలి. అంత డబ్బులు సామాన్య ప్రజల దగ్గర ఉండవు. అందుకే ప్రభుత్వాలు సామాన్యుల సొంతింటి కలను సాకారం చేసేందుకు అనేక పథకాలను ప్రవేశపెడుతోంది. ఈ పధకం ద్వారా ఇల్లు నిర్మించి ఇవ్వడంతో పాటు ఇల్లు కట్టుకోవాలనుకునేవారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొంత మొత్తంలో ఆర్ధిక సహాయం అందిస్తున్నాయి. అటువంటి పథకాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఒకటి. ఈ పథకం కింద ఇల్లు ఎలా నిర్మించుకోవాలో చూద్దాం.
తాజాగా ఏపీ ప్రభుత్వం పీఎం ఆవాస్ యోజన, ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కింద ఇంటి కోసం దరఖాస్తు చేసుకోవడానికి గుడువును పొడిగించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ స్కీమ్‌ను అందిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఈ నెల 14వ తేదీ వరకు ఈ పథకంలో లబ్ది పొందేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంతకుముందు నవంబర్ 30 వరకు గడువు ఇవ్వగా.. ఎక్కువమంది అప్లై చేసుకునేందుకు గడువు పొడిగించారు. గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లి అప్లికేషన్ పెట్టుకోవాలి. పీఎం అవాస్ యోజన pmayg.nic.in వెబ్‌సైట్ ద్వారా కూడా అప్లై చేసుకునే అవకాశముంది. ఏపీలో 15.59 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు కేవలం 3 లక్షల మంది మాత్రమే ఇళ్లను మంజూరు చేయగా.. నాలుగేళ్లల్లో మిగతా ఇళ్లను మంజూరు చేయాలని చూస్తోంది.
ఈ పధకం కింద అర్హులైన లబ్దిదారులకు రూ.2.50 లక్షల ఆర్ధిక సాయం అందిస్తారు. ఇక స్థలం లేనివారికి 3 సెంట్ల భూమితో పాటు ఆర్ధిక సహాయం అందిస్తారు. తెల్లరేషన్ కార్డు కలిగి ఉండటంతో పాటు సొంతిల్లు ఉండకూడదు.