Mandous Cyclone: ‘మాండూస్’ తుపాను ఎఫెక్ట్.. ఏపీ, తమిళనాడులోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం.. తుపానుగా మారి మరింత బలపడింది. ఈ తుపానుకు ‘మాండూస్‌’గా నామకరణం చేశారు. ప్రస్తుతానికి కారైకాల్‌కు తూర్పు ఆగ్నేయంగా 530 కిలోమీటర్లు, చెన్నై 620 కిలోమీటర్ల

Mandous Cyclone: ‘మాండూస్’ తుపాను ఎఫెక్ట్.. ఏపీ, తమిళనాడులోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..
Mandous Cyclone

Updated on: Dec 08, 2022 | 8:06 AM

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం.. తుపానుగా మారి మరింత బలపడింది. ఈ తుపానుకు ‘మాండూస్‌’గా నామకరణం చేశారు. ప్రస్తుతానికి కారైకాల్‌కు తూర్పు ఆగ్నేయంగా 530 కిలోమీటర్లు, చెన్నై 620 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. తుపాను నేపధ్యంలో కామన్ అలర్ట్ ప్రోటోకాల్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని ఆరు జిల్లాల్లోని కోటిమందికి పైగా సబ్ స్ర్కైబర్లకి హెచ్చరిక సందేశాలు పంపింది అమరావతి ఐఎండీ. తుపాను గమనాన్ని పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలు చేస్తున్నారు వాతావరణ శాఖ అదికారులు. తుపాను.. పశ్చిమ-వాయువ్య దిశగా పయనిస్తోంది. శుక్రవారం అర్థరాత్రి పుదుచ్చేరి-శ్రీహరికోట మధ్య తీరం దాటే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు.

తీరం దాటే సమయంలో 65-85 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయన్నారు అధికారులు. ఈ తుపాను ప్రభావంతో మూడు రోజులపాటు.. దక్షిణ కోస్తాంధ్రాలోని ప్రకాశరం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. అలాగే, రాయలసీమలోని చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు అధికారులు. మిగిలిన చోట్ల విస్తారంగా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.

కాగా, తుపాను, భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అలర్ట్ అయ్యింది. ఇందులో భాగంగా.. సహాయక చర్యల కోసం 5 ఎన్డీఆర్ఎఫ్, 4 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను నియమించారు. శనివారం వరకు మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. అలాగే తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

తమిళనాడులోని 10 జిల్లాలకు రెడ్ అలర్ట్..

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపాను గా మారింది. ఈ మాండూస్ తుపాను శుక్రవారం సాయంత్రంలోపు తీరం దాటనుంది. అయితే, ఈ తుపాను ప్రభావం తమిళనాడుపై ఎక్కువగా ఉండనుంది. తమిళనాడులోని 9 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. కాగా, 10 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తమిళనాడులోని ప్రభావిత జిల్లాలకు ముందస్తుగానే చేరుకున్నాయి. తిరువారూర్‌, నాగపట్నంలో విద్యాసంస్థలు బంద్‌ ప్రకటించారు. పుదుచ్చేరి, కరైక్కాల్‌లో తీరం కోతకు గురైంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us