Rain Alert: దూసుకొస్తున్న వాయుగుండం.. ఈ ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు.. 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో
పశ్చిమ మధ్య - వాయువ్య బంగాళాఖాతంలో ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ - దక్షిణ ఒడిశా తీరాల వద్ద ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో, ఈరోజు ఉదయం 0830 గంటలకు అదే ప్రాంతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. దీన అనుబంధ ఉపరితల ఆవర్తనం, సగటు సముద్ర మట్టానికి 9.6 కి.మీ ఎత్తు వరకు విస్తరించి, నైరుతి వైపుకు వంగి ఉంటుంది.

పశ్చిమ మధ్య – వాయువ్య బంగాళాఖాతంలో ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ – దక్షిణ ఒడిశా తీరాల వద్ద ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో, ఈరోజు ఉదయం 0830 గంటలకు అదే ప్రాంతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. దీన అనుబంధ ఉపరితల ఆవర్తనం, సగటు సముద్ర మట్టానికి 9.6 కి.మీ ఎత్తు వరకు విస్తరించి, నైరుతి వైపుకు వంగి ఉంటుంది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతుంది.. తదుపరి 24 గంటల్లో వాయుగుండంగా కేంద్రీకృతమై 19 ఆగస్టు 2025 మధ్యాహ్నం దక్షిణ-ఒడిశా-ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలను దాటే అవకాశం ఉంది.
నిన్నటి తూర్పు-పశ్చిమ ద్రోణి ఇప్పుడు, పశ్చిమ మధ్య – వాయువ్య బంగాళాఖాతంలో ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాల వద్ద ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి, ఈశాన్య అరేబియా సముద్రం – దానికి ఆనుకుని ఉన్న దక్షిణ గుజరాత్ & కొంకణ్ & గోవా వరకు, ఉత్తర మరాఠ్వాడ, విదర్భ, దక్షిణ ఛత్తీస్‌గఢ్, దక్షిణ ఒడిశా మీదుగల అల్పపీడన ప్రాంతంతో అనుభమందు ఉన్న ఉపరితల ఆవర్తనం మీదుగా సగటు సముద్ర మట్టానికి 1.5 & 5.8 కి.మీ మధ్య ఎత్తులో దక్షిణం వైపు వంగి ఉంటుంది.
వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు:
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-
ఆదివారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలాచోట్ల కురిసే అవకాశముంది. అత్యంత భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 40 – 50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.
సోమవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలాచోట్ల కురిసే అవకాశముంది. అత్యంత భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 50-60 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.
మంగళవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేకచోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు – బలమైన గాలులు గంటకు 50-60 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్:-
ఆదివారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేకచోట్ల కురిసే అవకాశ భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు – బలమైన గాలులు గంటకు 40-50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.
సోమవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలాచోట్ల కురిసే అవకాశముంది. అత్యంత భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు – బలమైన గాలులు గంటకు 50-60 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.
మంగళవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేకచోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు – బలమైన గాలులు గంటకు 50-60 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.
రాయలసీమ:-
ఆదివారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలాచోట్ల కురిసే అవకాశముంది. భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు – బలమైన గాలులు గంటకు 40- 50కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.
సోమవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలాచోట్ల కురిసే అవకాశముంది. భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు – బలమైన గాలులు గంటకు 50-60 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.
మంగళవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేకచోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు – బలమైన గాలులు గంటకు 50-60 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉందని.. అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు ప్రకటనలో తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
