AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Special Trains: తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. అందుబాటులోకి ప్రత్యేక రైళ్లు!

తిరుపతి వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. రోజురోజుు పెరుగుతున్న రద్దీ దృష్యా ప్రయాణికుల సౌకర్యార్థం.. సికింద్రాబాద్‌- తిరుపతి మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడిపేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ ప్రత్యేక రైళ్లు ఆది, సోమవారాల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నట్టు పేర్కొంది.

Special Trains: తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. అందుబాటులోకి ప్రత్యేక రైళ్లు!
Trains
Anand T
|

Updated on: Aug 17, 2025 | 3:11 PM

Share

శ్రావణమాసం, వరుస సెలవుల నేపథ్యంలో హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు సంఖ్య పెరిగింది. ఇప్పటికే శ్రీవారి కొండ భక్తులతో కిటకిటలాడుతోంది. అయినా ఇంకా తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు వెళ్తూనే ఉన్నారు. దీంతో ట్రైన్‌లు కూడా భక్తులలో కిక్కిరిసి ప్రయాణిస్తున్నాయి. ఈ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రెండు నగరాల మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆదివారం, సోమవారం( 17, 18 తేదీల్లో) ఈ ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.

ప్రత్యేక రైళ్ల వివరాలు ఇవే…

తిరుపతి నుంచి సికింద్రాబాద్‌ మధ్య నడిచే (07097) నెంబర్ గల ప్రత్యేక రైలు ఆదివారం తిరుపతి నుండి బయల్దేరి సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. అలాగే, సికింద్రాబాద్ నుంచి తిరుపతి మధ్య నడిచే (07098) నెంబర్‌ గల మరో ప్రత్యేక రైలు ఆగస్ట్ 18 సోమవారం అందుబాటులో ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లలో ఫస్ట్ క్లాస్ AC, 2AC, 3AC, ఎకానమీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయని రైల్వేశాఖ అధికారులు తెలిపారు.

ఈ ప్రత్యేక ట్రైన్స్‌ ఎక్కడెక్కడ ఆగుతాయి..?

సికింద్రాబాద్- తిరుపతి మధ్య నడిచే ఈ ప్రత్యేక రైళ్లు మార్గమధ్యంలో రేణిగుంట, రాజంపేట, కడప, యర్రగుంట్ల, తాడిపత్రి, గుంతకల్, ఆదోని, మంత్రాలయం రోడ్, రాయచూర్, కృష్ణ, యాద్గిర్, తాండూర్, వికారాబాద్, లింగంపల్లి, బేగంపేట్ స్టేషన్లలో ఆగుతాయని అధికారులు తెలిపారు. ఈ మార్గంలో ప్రయాణించే ప్రాయణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సౌత్ సెంట్రల్‌ రైల్వే అధికారులు సూచించారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!
కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!
పాన్ కార్డులో ఫొటోను ఇంట్లో నుంచే నిమిషాల్లో మార్చుకోండి..
పాన్ కార్డులో ఫొటోను ఇంట్లో నుంచే నిమిషాల్లో మార్చుకోండి..