విశాఖపట్నం, అక్టోబర్ 23: బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం కొనసాగుతోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం కేంద్రీకృతమైవుంది. మరికొద్ది గంటల్లో తుఫానుగా మారే అవకాశం స్పష్టంగా ఉన్నట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. తీవ్ర వాయుగుండం తుఫానుగా మారితే ‘హమూన్’గా నామకరణం చేస్తారు. తీవ్రవాయుగుండం దిశ మార్చుకుంది. ఉత్తర ఈశాన్య దిశగా సాగుతోంది. ఈనెల 25 సాయంత్రం బంగ్లాదేశ్ ఖేపుపర – చిట్టగాంగ్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. తీరం దాటే సమయంలో తుపాను బలహీన పడుతుందని తాజా బులెటన్‌లో ప్రకటించింది. తుఫాను ప్రభావం ఏపీపై అంతగా ఉండకపోవచ్చు అని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. కోస్తాలో రెండు మూడు రోజుల పాటు అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తీవ్ర వాయుగుండం మరింత బలపడే అవకాశం ఉన్న నేపథ్యంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరిక జారీ చేసింది విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం. ఇప్పటికే తమిళనాడు, కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించిన రుతుపవనాలు వర్షాలు కురిపిస్తున్నాయి. అయితే మరింత విస్తరించేందుకు కాస్త రుతుపవనాలు బలహీనంగా ఉన్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉండగా అరేబియా మహాసముద్రంలో ఏర్పడిన తేజ్ తీవ్ర తుఫాను మరింత బలపడుతోంది. ఇది భారతదేశ తీరానికి దూరంగా కేంద్రీకృతమై ఉంది. యమెన్, ఒమన్ దేశాల వైపు అది కదులుతుందని వాతావరణ శాఖ చెబుతోంది.
Cyclone taking U turn towards Bangladesh 👍 pic.twitter.com/T4uW8QyKGp
— Vizag Weatherman@AP (@VizagWeather247) October 23, 2023