Jawad Cyclone: ఆంధ్రప్రదేశ్‌కు జోవాద్ గండం ముంచుకొస్తోంది. తుఫాన్ ఎఫెక్ట్ ఏపీలో భారీగానే ఉండబోతోంది. ప్రస్తుతం జోవాద్ విశాఖకు 120 కిలోమీటర్ల దూరంలో.. గోపాల్‌పూర్‌కు 200 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. గంటకు 20 కిలోమీటర్ల వేగంతో తుఫాన్ కదులుతోంది. తుఫాన్ దిశ మార్చుకుని ఒడిశా వైపు పయనిస్తున్నట్టు వాతావరణశాఖ వెల్లడించింది. ఇవాళ మధ్యాహ్నానికి ఒడిశాలోని పూరీ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. ఆ తరువాత ఒడిశా కోస్తా వెంబడి ప్రయాణం కొనసాగించి పశ్చిమ బెంగాల్ తీరం వైపునకు వెళ్లే అవకాశం ఉందన్నారు. అయితే.. జోవాద్ తుఫాన్ ప్రభావం ఏపీపై తీవ్రంగా ఉండే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు.
కాగా, తుఫాన్ ప్రభావంతో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇంకా తీరానికి దగ్గరగా వచ్చిన సమయంలో 100 కిలోమీటర్ల వేగంలో గాలులు వీస్తాయని చెప్పారు. అయితే.. ఏపీలో తుఫాన్‌ను ఎదుర్కోవడానికి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నట్టు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. తుఫాన్ తీవ్రతపై ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం సమీక్ష జరిపారు. తుఫాన్ ప్రభావిత జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. తుఫాన్ కారణంగా దక్షిణ మధ్య రైల్వే, ఈస్ట్ కోస్ట్ రైల్వే 120 రైళ్లను ర్దు చేసింది. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు సహా 1,735 సహాయక బృందాలను ఏర్పాటు చేశారు. హెలికాఫ్టర్లు, పడవలతో తూర్పు నావికాదళం సర్వసన్నద్ధమైంది.
Also read:
Omicron Tension: ఒమిక్రాన్ భయం.. ఆటోమొబైల్..ఎలక్ట్రానిక్ కంపెనీలు ఏం చేస్తున్నాయంటే..
Corona Tension: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిసిన మంగోలియా ప్రతినిధి బృందంలో కరోనా కలకలం