బంగాళాఖాతంలో హమూన్ తీవ్ర తుపాను.. సముద్రం అల్లకల్లోలం.. ప్రభావం ఇదే

| Edited By: Ram Naramaneni

Oct 24, 2023 | 7:58 AM

వాతావరణ శాఖ తాజా అప్డేట్ ప్రకారం.. తుపాను ఉత్తర ఈశాన్య దిశగా గంటకు 14 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇది ఉత్తర ఈశాన్య దిశగా కదులుతు ఈనెల 25 సాయంత్రం బంగ్లాదేశ్ ఖేపు పర - చిట్టగాంగ్ మధ్య తీరం దాటనుంది తుపాను. ఇప్పటికే ఒడిస్సా, పశ్చిమ బెంగాల్ తీరాల వెంబడి బలమైన ఈదురు గాలులు వేస్తున్నాయి.

బంగాళాఖాతంలో హమూన్ తీవ్ర తుపాను.. సముద్రం అల్లకల్లోలం.. ప్రభావం ఇదే
Weather Report
Follow us on

బంగాళాఖాతంలో తుపాను ఏర్పడింది. ఇది మరింత బలపడి తీవ్ర తుఫాన్ గా మారింది . తీవ్ర తుఫానుకు హమూన్ గా నామకరణం చేశారు. హమూన్ వాయువ్య బంగాళాఖాతంలో ప్రస్తుతానికి కేంద్రీకృతమై ఉంది.

ఏపీపై ప్రభావం లేదు..

– వాతావరణ శాఖ తాజా అప్డేట్ ప్రకారం.. తుపాను ఉత్తర ఈశాన్య దిశగా గంటకు 14 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇది ఉత్తర ఈశాన్య దిశగా కదులుతు ఈనెల 25 సాయంత్రం బంగ్లాదేశ్ ఖేపు పర – చిట్టగాంగ్ మధ్య తీరం దాటనుంది తుపాను. ఇప్పటికే ఒడిస్సా, పశ్చిమ బెంగాల్ తీరాల వెంబడి బలమైన ఈదురు గాలులు వేస్తున్నాయి. ఉత్తర ఒడిస్సా పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఆయా రాష్ట్రాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మరోవైపు తుఫాను సూచికగా.. విశాఖ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులో రెండో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్టు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. మరోవైపు ఈశాన్య రుతుపవనాలు బలహీనంగా ఉన్నాయి. ఉత్తరకొస్తాలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ చెదురు మదురు వర్షలకు ఆస్కారం ఉందని అంచనా వేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి