Andhra Pradesh: బీ అలర్ట్.. ప్రభుత్వ స్కీంల పై కన్నేసిన సైబర్ నేరగాళ్లు.. ఓటిపి లతో జాగ్రత్త..!

| Edited By: Jyothi Gadda

Oct 18, 2023 | 9:04 AM

ప్రభుత్వ అధికారులు అలాంటి సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఆ క్రమంలోనే ప్రజలకు కొన్ని సూచనలు తెలియజేస్తున్నారు. ఎవరైనా మీకు తెలియని వ్యక్తులు మీకు ఫోన్ చేసి, మీకు ప్రభుత్వ పథకాలు మంజూరు అయ్యాయని, అలాగే మీకు ఇంటి స్థలం మంజూరైందని  లేక అమ్మఒడి ఇతరత్ర పథకాలకు మీరు అర్హులయ్యారని చెప్పి,

Andhra Pradesh: బీ అలర్ట్.. ప్రభుత్వ స్కీంల పై కన్నేసిన సైబర్ నేరగాళ్లు.. ఓటిపి లతో జాగ్రత్త..!
Cyber Criminals
Follow us on

ఏలూరు, అక్టోబర్18: మీ ఫోన్లో ఓటిపిలు వస్తున్నాయా.. జాగ్రత్త సుమా.. తొందరపడ్డారా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.. నీకు ఇంటి స్థలం మంజూరు అయింది, లేదా నీవు ప్రభుత్వ పథకానికి అర్హుడివి అయ్యావు అంటూ.. నీ ఫోన్లకు ఓటిపిలు పంపుతున్నారా.. అలాగే ఎవరైనా మీకు ఫోన్ చేసి వచ్చిన ఓటీపీలు చెప్పమంటున్నారా.. అయితే ఇది మీకోసమే.. జాగ్రత్తగా చదవండి.. ఆదమరిచారా అంతే సంగతులు.. తరువాత నెత్తి నోరు కొట్టుకున్న జరగాల్సిన నష్టం జరిగి తీరిపోతుంది.. ఓటిపిల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ అధికారులు సైతం హెచ్చరిస్తున్నారు. ఇటీవల కాలంలో ఎంతోమంది సైబర్ మోసగాళ్ల చేతుల్లో చిక్కి లక్షల రూపాయలు పోగొట్టుకున్న ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. కాస్త జాగ్రత్తగా ఉంటే వారి మోసానికి అడ్డుకట్ట వెయవచ్చని అధికారులు అంటున్నారు.

అసలు ఓటిపి చెప్పడం వల్ల మనకు జరిగే నష్టం ఏంటి..? ఓటిపి చెప్పమని మనల్ని ఎందుకు అడుగుతారు.. ఒకవేళ నిజంగా ఓటీపీ చెప్పవలసి వస్తే ఎవరికి చెప్పాలి.. దానికి సంబంధించిన విధి విధానాలు ఇప్పుడు తెలుసుకుందాం..

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ప్రతి లబ్ధిదారుడికి నేరుగా పథకాలు వారి వద్దకే అందించేలా గ్రామ, వార్డు ఉద్యోగులు నిరంతరం కృషి చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ ఉద్యోగులని ఆ వ్యవస్థని అడ్డుపెట్టుకుని కేటుగాళ్లు ప్రజలను దోచుకుంటున్నారు. ప్రభుత్వ అధికారులు అలాంటి సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఆ క్రమంలోనే ప్రజలకు కొన్ని సూచనలు తెలియజేస్తున్నారు. ఎవరైనా మీకు తెలియని వ్యక్తులు మీకు ఫోన్ చేసి, మీకు ప్రభుత్వ పథకాలు మంజూరు అయ్యాయని, అలాగే మీకు ఇంటి స్థలం మంజూరైందని  లేక అమ్మఒడి ఇతరత్ర పథకాలకు మీరు అర్హులయ్యారని చెప్పి, మీ ఫోన్ కి ఓటీపీ పంపించామని అది వారికి తెలుపమని అడుగుతున్నారా.. ? అయితే అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఏ ఉద్యోగి కూడా ఫోన్లో లబ్ధిదారులను ఓటిపి చెప్పమని అడగరని, అలా ఎవరైనా అడిగితే వారికి ఫోన్లో ఓటీపీలు చెప్పవద్దని అంటున్నారు. ఒకవేళ మీరు ఏ ప్రభుత్వ పథకానికైనా అర్హులు అయితే నేరుగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులే మీ వద్దకు వచ్చి మీ ముందే ఓటిపి తీసుకుంటారని, అపరిచిత వ్యక్తులు ఫోన్ చేస్తే ఓటిపిలు చెప్పవద్దని స్పష్టం చేస్తున్నారు. అలా సైబర్ నెరగాళ్లకు ఓటిపిలు చెప్పడం ద్వారా మన బ్యాంకు ఖాతాలను హ్యాక్ చేసి లక్షలాది రూపాయల నగదు కొల్లగొడుతున్నారనీ, ప్రజలు వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో సచివాలయ ఉద్యోగులమంటు, ప్రభుత్వ పథకాల పేరుతో లబ్ధిదారులకు ఫోన్లు చేస్తూ ఓటిపిలు తీసుకుని, వారి అకౌంట్లో నుంచి లక్షలాది రూపాయలు కాజేసిన ఫిర్యాదులు అధికారులకు పెద్ద ఎత్తున వస్తున్నాయి .

ఇలాంటి సైబర్ నేరగాళ్ల అగడాలకు అడ్డుకట్ట వేయాలని అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యల్లో చేపట్టారు.. ప్రతి ఒక్క లబ్ధిదారుడిని సైబర్ నేరాల పట్ల చైతన్యం చేస్తూ, వారి వలలో చిక్కకుండా ఉండేందుకు వారికి అవగాహన కార్యక్రమాలు సైతం చేపట్టారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..