Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyber Crime: యూట్యూబ్ లింక్ క్లిక్ చేసి రూ.7.50 లక్షలు పోగొట్టుకున్న టెకీ.. నమ్మకంతోనే నయవంచన!

సైబర్ నేరగాళ్ళు ఎంత మందికి, ఎన్ని రకాలుగా కుచ్చు టోపీ పెట్టినా పబ్లిక్‌లో ఏ మాత్రం మార్పు రావటం లేదు. సైబర్ దందా ఈ పేరు తెలియాని వారే ఉండరు. మారు మూలపల్లెటూర్ల నుంచి పెద్ద పెద్ద సిటీల వరకు ఇందులో అందరు బాధితులే. ముసలీ ముతకా, చిన్న పెద్ద, చదువుకున్న వారు, చదువులేని వారు ఎవరికైన సైబర్ నేరగాళ్ళు గేలం వేస్తే అట్టే దొరికిపోతున్నారు. ఎలా వేస్తారో తెలియదు. ఏ రకంగా వస్తారో తెలియదు.. కానీ అకౌంట్‌లో డబ్బులు ఖాళీ అయ్యాక కానీ..

Cyber Crime: యూట్యూబ్ లింక్ క్లిక్ చేసి రూ.7.50 లక్షలు పోగొట్టుకున్న టెకీ.. నమ్మకంతోనే నయవంచన!
Cyber Crime
Follow us
P Kranthi Prasanna

| Edited By: Srilakshmi C

Updated on: Oct 12, 2023 | 8:15 PM

తోట్లవల్లూరు, అక్టోబర్‌ 12: సైబర్ నేరగాళ్ళు ఎంత మందికి, ఎన్ని రకాలుగా కుచ్చు టోపీ పెట్టినా పబ్లిక్‌లో ఏ మాత్రం మార్పు రావటం లేదు. సైబర్ దందా ఈ పేరు తెలియాని వారే ఉండరు. మారు మూలపల్లెటూర్ల నుంచి పెద్ద పెద్ద సిటీల వరకు ఇందులో అందరు బాధితులే. ముసలీ ముతకా, చిన్న పెద్ద, చదువుకున్న వారు, చదువులేని వారు ఎవరికైన సైబర్ నేరగాళ్ళు గేలం వేస్తే అట్టే దొరికిపోతున్నారు. ఎలా వేస్తారో తెలియదు. ఏ రకంగా వస్తారో తెలియదు.. కానీ అకౌంట్‌లో డబ్బులు ఖాళీ అయ్యాక కానీ మోసపోయాం అని గుర్తించలేకపోతున్నాం. ప్రతి రోజు ఏదో ఒక రకంగా పబ్లిక్ నుంచి కోట్లలో దోచేస్తున్నారు. ఇందులో తెలిసి మోసపోయే వారు కొంతమంది అయితే మోసపోతామేమోననే అనుమానంతో నిజంగానే మోసపోయే వారు మరికొంతమంది.

ఇక తాజాగా సైబర్ నేరగాళ్ల చేతుల్లో చదువుకున్న ఓ యువతి ఏకంగా 7.50 లక్షలు పోగొట్టుకుంది. గత కొద్దీ కాలంగా సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోతున్నవారిలో యువతే ఎక్కువమంది ఉంటున్నారు. మోసపోయిన యువతిది కృష్ణ జిల్లా పామర్ మండలం తోట్లవల్లూరు గ్రామం సాఫ్ట్‌వెర్ ఉద్యోగం చేస్తున్న ఈ యువతి యూ ట్యూబ్ చూస్తుండగా వచ్చిన ఒక లింక్ ద్వారా తన ఖాతాలో ఉన్న డబ్బును పోగొట్టుకుని లబోదిబో మంటూ పోలీసులను ఆశ్రయించింది. రూ.7.50 లక్షల రూపాయలు పోగొట్టుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చెయ్యటంతో అసలు వ్యవహారం బయటపడింది.

యూట్యూబ్ చూస్తున్న యువతికి టెలికం పేరుతో తొలుత ఒక లింకు వచ్చింది. దాంట్లో రూ.వంద పెట్టుబడి పెడితే రూ.200 వస్తాయని ఉండటంతో మొదట ట్రయిల్‌గా కొంత డబ్బు పెట్టుబడిగా పెట్టింది. ఆమె పెట్టిన డబ్బు కంటే అధిక మొత్తంలో డబ్బు రావడంతో అందులో ఉన్న పెట్టుబడులు అనుసరిస్తూ పెడుతూనే ఉంది. తొలిసారి 1000 పంపిస్తే రూ.1600 వచ్చాయని, తర్వాత రూ.6000 పంపిస్తే రూ.12000 వచ్చాయని, ఆఫర్ పేరుతో రూ 10000 వేస్తే రూ.20,000 డబ్బులు రావటంతో.. యువతకి నమ్మకం కుదిరింది. దీంతో ఒక్కసారిగా అధిక మొత్తంలో పెట్టింది. పెట్టిన డబ్బులు రాకపోగా టాస్క్ లంటూ.. అదంటూ.. ఇదంటూ మరింత డబ్బులు పెడుతూ మొత్తం డబ్బులన్నీ పోగొట్టుకున్నాక పొసపోయానని గ్రహించింది. దీంతో చేసేది లేక పోలీసులని ఆశ్రయించింది. దీనిపై కేస్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.