అది ఆంధ్రప్రదేశ్‌లోని ఉండవల్లి ప్రాంతం.. అక్కడ స్థానికంగా ఉన్న ఓ వ్యవసాయ భూమిలో విద్యుత్ లైన్‌మాన్‌కు వింత అనుభవం ఎదురైంది. అదేంటో మీరు వింటే కచ్చితంగా షాక్ అవుతారు. సహజంగా వ్యవసాయ భూమిలో రైతులు పొద్దునే మోటర్ స్విచ్ వేసి పొలానికి నీరు పడతారు. అనంతరం నీరు అందాక స్విచ్ ఆఫ్ చేస్తారు.? ఇది రోజూ వారి డైలీ రొటీన్. ఇదిలా ఉంటే.. ఇటీవల ఓ విద్యుత్ లైన్‌మాన్.. ఆ వ్యవసాయ భూమిలో ఉన్న విద్యుత్ మోటారుకు సంబంధించిన విద్యుత్ మీటర్‌ను పరిశీలించేందుకు వచ్చాడు.
ఎప్పటిలానే మీటర్ రీడింగ్ తీసేందుకు విద్యుత్ మీటర్ డోర్‌ను ఓపెన్ చేశాడు. అంతే ఒక్కసారిగా అతడి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఎప్పటినుంచో అందులో ఉన్న త్రాచు పాము అతడిపై ఒక్కసారిగా దాడి చేసింది. మనోడు వచ్చే ప్రమాదాన్ని ముందే గమనించడంతో.. ఆ దాడి నుంచి తృటిలో తప్పించుకుని ‘హమ్మయ్యా’ అని అనిపించుకున్నాడు. వెంటనే డోర్‌ను మూసేసి.. స్నేక్ క్యాచర్‌కు సమాచారాన్ని అందించాడు. అతడు ఘటనాస్థలానికి చేరుకొని ఆ పామును చాకచక్యంగా పట్టుకున్నాడు. ఆ తర్వాత స్థానికంగా ఉన్న కొండ ప్రాంతానికి తీసుకెళ్లి వదిలిపెట్టాడు.
Also Read:
Viral Photo: మాములుగా ఉండదు మనతో.. ఈ ఫోటోలో పామును కనిపెడితే మీరే జీనియస్.!!
Telangana: కొండ గుహ నుంచి వింత శబ్దాలు.. భయపడుతూ వెళ్లి చూడగా ఫ్యూజులు ఔట్.!
Cricket: 53 పరుగులకే 7 వికెట్లు.. కట్ చేస్తే ప్రత్యర్ధి బౌలర్లపై కెప్టెన్ పెను విధ్వంసం.. చివరికి..