AP Elections: ఏపీలో ఎన్నికల నిర్వహణపై సీఎస్ ఉన్నతస్థాయి సమావేశం.. పాల్గొన్న ఎన్నికల అధికారి..
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల కోసం ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే గత నెలలో విజయవాడ వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు అన్ని జిల్లాల కలెక్టర్లు, రాష్ట్ర స్థాయి అధికారులకు పలు సూచనలు చేసారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల అధికారులతో కూడా సమావేశమయ్యారు. ఎన్నికలు పారదర్శకంగా, ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల కోసం ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే గత నెలలో విజయవాడ వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు అన్ని జిల్లాల కలెక్టర్లు, రాష్ట్ర స్థాయి అధికారులకు పలు సూచనలు చేసారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల అధికారులతో కూడా సమావేశమయ్యారు. ఎన్నికలు పారదర్శకంగా, ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున చేపట్టాల్సిన చర్యలపై సీఎస్ జవహర్ రెడ్డికి పలు సూచనలు చేసారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు ఎన్నికల సన్నద్దతపై సీఎస్ జవహర్ రెడ్డి అమరావతి సచివాలయంలో కీలక సమావేశం నిర్వహించారు.
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాతో పాటు ఇతర ముఖ్య శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, చీఫ్ కమీషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్ గిరిజా శంకర్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డైరెక్టర్ యం.రవి ప్రకాశ్, రవాణా శాఖ కమీషనర్ మణీశ్ కుమార్ ఎస్ఎల్బిసి కన్వీనర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రానున్నసాధారణ ఎన్నికలను పటిష్టంగా సక్రమంగా నిర్వహించేందుకు వీలుగా సంబంధిత శాఖలు ఇప్పటి నుండే తగిన కార్యాచరణను సిద్ధం చేసుకోవాలని సీఎస్ తెలిపారు.
రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు సహా ఎన్నికల విధులలో నేరుగా సంబంధం ఉన్న వివిధ అధికారుల ఖాళీల భర్తీతో పాటు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం, జిల్లా ఎన్నికల అధికారుల కార్యాలయాల్లో అవసరమైన సిబ్బంది కేటాయింపు అంశాలపై సీఈవో ముఖేష్ కుమార్ మీనాతో సీఎస్ జవహర్ రెడ్డి చర్చించారు. వెంటనే ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను పంపాలని స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధుల నిర్వహణతో సంబంధం ఉండి ఒకే ప్రాంతంలో మూడు నాలుగేళ్ళ సర్వీసు పూర్తి చేసుకున్నఅధికారులను తప్పనిసరి బదిలీ చేయడంతో పాటు కొత్తవారికి పోస్టింగులు వంటి వాటిపై కూడా వెంటనే తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా ఉండాల్సిన కనీస సౌకర్యాలకు సంబంధించిన అంశాలపై సీఎస్ పలు సూచనలు చేసారు.
మద్యం,నగదు అక్రమ రవాణాపై ప్రత్యేక చర్యలు:
రానున్నఎన్నికల్లో డబ్బు,మద్యం వంటివి అక్రమ రవాణా నియంత్రణకు సంబంధిత శాఖల అధికారులకు పలు ఆదేశాలిచ్చారు. అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో పటిష్టమైన ఇంటిగ్రేటెడ్ చెక్కు పోస్టులను ఏర్పాటు చేయడానికి అవసరమైన చర్యలపై నా చర్చించారు. సరిహద్దు నిఘా అంశాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా రాష్ట్ర అధికారులతో త్వరలో సమన్వయ సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈ అంశంపై ఒడిస్సా సీఎస్‌తో మాట్లాడతానని చెప్పారు. పోలీస్, రెవెన్యూ, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, రవాణా, ఆర్ అండ్ బి, పంచాయితీరాజ్, విద్యాశాఖ, మున్సిపల్ శాఖలు ఇప్పటి నుండే తగిన కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. ఎన్నికలను అత్యంత పారదర్శకంగా సజావుగా సకాలంలో నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని శాఖల అధికారులు అత్యంత బాధ్యతా యుతంగా పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు.
రాష్ట్రంలో 46వేల 165 పోలింగ్ కేంద్రాలున్నాయని.. వాటిలో ఉండాల్సిన కనీస సౌకర్యాలు గురించి ప్రస్తావించారు. అందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎస్ దృష్టికి ఈసీవో తీసుకెళ్లారు. ఏపీలోని అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో 29 ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్‌లు న్నాయని.. వాటిని పటిష్టంగా నిర్వహించడం ద్వారా డబ్బు, మద్యం, గంజాయి ఇతర మత్తు పదార్ధాల అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవడం జరుగుతోందని అధికారులు తెలిపారు. వీటితో పాటు రాష్ట్రంలో 76 పోలీస్ చెక్ పోస్ట్‌లు , 14 అటవీ చెక్ పోస్ట్‌ల వద్ద కూడా నిఘా పెంచుతామన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..