Andhra Pradesh: విజయనగరంలో కానిస్టేబుల్ డోకల శ్రీనివాసనాయుడు మిస్సింగ్ అంశం మిస్టరీగా మారింది. డిసెంబర్ 30న ఇంటి నుంచి వెళ్లిన శ్రీనివాసనాయుడు ఇప్పటి వరకు కనిపించకపోవడంతో సంచలనంగా మారింది. వివరాల్లోకెళితే.. విశాఖ ఎంపివి క్రైమ్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న శ్రీనివాసనాయుడు.. డిసెంబర్ 30వ తేదీన తన స్వగ్రామం గరుగుబిల్లి మండలం నందివాని వలసకు వచ్చాడు. అయితే, తన స్వగ్రామం నుండి కురుపాం మండలం కస్పా గధబవలసలో భూమి కొనుగోలుకు వెళ్లాడు. భూమి కోసం బేరసారాలు చేశాడు కానిస్టేబుల్ శ్రీనివాసనాయుడు. అక్కడి నుంచి తిరిగి వెళ్తూ మార్గమధ్యలో మిస్సయ్యాడు. ఎంతకీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆయన ఫోన్ నెంబర్‌కు ఫోన్ చేశారు. ఫోన్ కలవకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. మిస్సైన కానిస్టేబుల్ కోసం గాలింపు చేపట్టారు. మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కానిస్టేబుల్ శ్రీనివాసనాయుడు కోసం గాలింపు చేపట్టారు పోలీసులు. కాగా, కానిస్టేబుల్ మిస్సింగ్ జిల్లాలో సంచలనంగా మారింది. అసలేం జరిగిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also read:
Srisailam: శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. ఇకపై అది తప్పనిసరి.. కీలక ప్రకటన చేసిన టెంపుల్ ఈవో..
Kerala High Court: చెప్పేందుకు చాలా ధైర్యం కావాలి.. లైంగిక వేధింపులపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..