CPI Narayana: సీపీఐ నారాయణకు సతీ వియోగం.. అనారోగ్యంతో చికిత్స పొందుతూ కన్నుమూత

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నారాయణ సతీమణి వసుమతి కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు.

CPI Narayana: సీపీఐ నారాయణకు సతీ వియోగం.. అనారోగ్యంతో చికిత్స పొందుతూ కన్నుమూత
Narayana Wife Vasumathi

Updated on: Apr 14, 2022 | 8:22 PM

CPI Narayana’s Wife: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నారాయణ సతీమణి వసుమతి(67) కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తిరుపతిలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. వసుమతి మరణ వార్త సీపీఐ శ్రేణుల్లో విషాదం నింపింది. ఆమె మరణవార్త తెలిసిన సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. రేపు నగరి మండలం ఐనంబాకంలో వసుమతిదేవి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

వసుమతి విద్యార్థిని ఉండగానే AISFలో ప‌నిచేశారు. చదువు పూర్తయ్యాక బ్యాంక్‌లో ఉద్యోగం చేశారు. వాలంట‌రీ రిటైర్‌మెంట్ తీసుకొని కమ్యూనిస్టు పార్టీలో పూర్తి స్థాయి కార్యకర్తగా ఉండిపోయారు. నారాయణకు అన్ని విధాలుగా చెదోడు వాదోడుగా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. వసుమతి మృతికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సంతాపం వ్యక్తం చేశారు. వసుమతి మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి. కమ్యూనిస్టు పార్టీకి ఆమె ఎనలేని సేవలు అందించార న్నారు. రేపు ఉదయం 11 గంటలకు చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం ఐనంబాకం గ్రామంలో వసుమతి అంత్యక్రియలు జరుగుతాయి.

Read Also…  Ayurvedic Hospitals: ఆయుర్వేద దవాఖానాలకు సుస్తీ.. వైద్యులు లేక ఆగచాట్లు పడుతున్న రోగులు..!