CPI Narayana: చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన కామెంట్స్ చేశారు. సోమవారం తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అల్లూరి సీతారామరాజు జయంతి రోజు నిర్వహించిన విగ్రహావిష్కరణ సమయంలో సూపర్ స్టార్ కృష్ణను ఆహ్వానిస్తే బాగుండేదని.. అలా కాకుండా ఊసరవెల్లిలా ప్రవర్తించే చిరంజీవిని సభా వేదికపైకి తీసుకురావడం సరైంది కాదని వ్యాఖ్యానించారు. ఇక పవన్ కళ్యాణ్ ల్యాండ్‌మైన్ లాంటి వారని, ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో ఆయనకే తెలీదు అంటూ ఎద్దేవా చేశారు.
అక్కడితే ఆగని నారాయణ రాష్ట్రపతి ఎన్నికల్లో ఏన్డీయే అభ్యర్థికి మద్ధతు ఇవ్వడంపై కూడా స్పందించారు. ఏపీకి కేంద్ర ఏం చేయకపోయినా ఎన్డీయే అభ్యర్థికి ఎందుకు ఓటు వేశారని ప్రశ్నించారు. బీజేపీ నేతల బ్లాక్‌మెయిల్లకు ఏపీలో నేతలు భయపడుతున్నారంటూ ఆరోపించారు. ఏపీ రాజధాని విజయవాడ అనే భావనను వైసీపీ పొగేట్టేందుకు కుట్రలు చేస్తోందని దుయ్యబట్టారు. ఏపీకి రాజధాని కావాలన్న ఆలోచన వైసీపీ సర్కార్ కు లేదు వైసీపీ నేతలు రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా హైదరాబాద్ ను రాజధానిగా భావిస్తున్నారు అంటూ విమర్శించారు.
ఇక ఏపీ రోడ్ల దుస్థితి పై జనసేన చేస్తున్న నిరసనలు స్వాగతించిన నారాయణ, ఏపీ ప్రభుత్వం వరదల భీభత్సాన్ని అంచనా వేయడంలో విఫలమైందని విమర్శించారు. అలాగే వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని, ప్రభుత్వానికి వరద అంచనా లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరదల కారణంగా సర్వం కోల్పోయిన బాధితులకు పక్కా ఇళ్లను నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..