ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కోరలు చాస్తోంది. ఈ తరుణంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపధ్యంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులను పొడిగిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు పాఠశాల విద్యా కమిషనర్ చిన వీరభద్రుడు ఉత్తర్వులను జారీ చేశారు. వాస్తవానికి ఈ విద్యా సంవత్సరం జూన్ 3తో ముగియనుంది. అయితే కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని విద్యార్ధులకు పరీక్షలు నిర్వహించకుండానే మరోమారు సెలవులను పొడిగించింది.
ఇక జూన్ 30 తర్వాత అప్పటి పరిస్థితిని సమీక్షించి సెలవులు పొడిగించాలా.? లేక పరీక్షలు నిర్వహించాలా.? అనే దానిపై ఓ నిర్ణయానికి వస్తామని ఉన్నతాధికారులు తెలిపారు.