సాటి మనిషిని రక్షించడానికి రక్తాన్ని ఇచ్చే ప్రక్రియ రక్తదానం. ప్రాణాలను నిలబెట్టే రక్తదానం చాలా గొప్పది. అయితే రక్తదానంపై సరైన అవగాహన లేకపోవడంతో.. మన దేశంలో ఏటా 12వేల మంది రక్తం అందుబాటులోకి లేకపోవడంతో మరణిస్తున్నారు. వాస్తవానికి బాధితులకు తగిన సమయంలో రక్తం డొనేట్ చేయవచ్చు.. లేదా ముందుగా రక్తం దానం చేసినా బ్లడ్ బ్యాంక్‌లో తగిన రీతిలో రక్తం నిల్వ చేయబడుతుంది. ఎవరైనా బాధితులకు రక్తం అవసరమైనప్పుడు ఈ రక్తం మార్పిడి చేయడానికి ఉపయోగిస్తారు. యాక్సిడెంట్ వంటి కొన్ని సందర్భాల్లో రక్తం కొరత ఏర్పడుతుంది. అప్పుడు వెంటనే రక్తం ఎక్కించకపోతే ఆ మనిషి ప్రాణం కోల్పోయాడు. దీనికి ముఖ్య కారణం రక్తదానంపై ఉన్న అపోహలతో ప్రజలు స్వచ్చందంగా రక్తాన్ని దానం చేయడనికి ముందుకు రాకపోవడం. దీంతో తాజాగా నవ దంపతులు రక్తదానం పై అవగాహన కల్పించడం కోసం సరికొత్త పంథా ఎంచుకున్నారు. తమ పెళ్లి వేడుకలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ ఘటన నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది.
జిల్లా కేంద్రంలో లోని ఓ వివాహ వేడుకలో ఓ వింత ఘటన జరిగింది. పెళ్ళి మండపంలో స్వచ్చంద రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాడు వరుడు. రక్తదానం చేసి అదర్శంగా నిలిచాడు వరుడు సూర్య తేజ. ఈ రక్తదాన శిబిరంలో వరుడితో పాటు వధుడు, బంధువులు స్వచ్ఛందంగా పాలుపంచుకున్నారు. మేము సైతం అంటూ రక్తదానంలో పాల్గొన్నారు. ఈపెళ్లి వేడుకలో రక్తదానం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. నలుగురు ప్రాణాలు కాపాడామనే సంతృప్తి కోసం రక్తదానం శిబిరం ఏర్పాటు చేశామని చెప్పాడు వరుడు తేజ. స్వచ్ఛంద కార్యక్రమం నిర్వాహించాలనే కోరిక రక్తదానంతో తీరిందన్నారు. గతంలో తన బ్రదర్ మ్యారేజ్ లో కూడా ఇలానే రక్తందానం నిర్వహించారని.. అది చూసి ఇన్‌స్పేర్ అయ్యానని చెప్పాడు వరుడు సూర్య తేజ. అయితే నంద్యాల కు చెందిన సూర్య తేజకు .. అనంతపురం జిల్లాకు చెందిన భవ్యకు వివాహం గ్రాండ్ గా చేశారు కుటుంబ సభ్యులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..