
ఎంతగా చైతన్యం తెస్తున్నప్పటికీ, భారీ ఎత్తున ప్రచారం జరుగుతున్నప్పటికీ, రోజురోజుకూ సైబర్ మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. పోలీసు శాఖ, ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలంటూ ఎంత అవగాహన కల్పించినా ఏదో ఒకచోట ప్రజలు సైబర్ మోసాల బారిన పడుతూనే ఉన్నారు. తాజాగా క్రెడిట్ కార్డు యాక్టివేట్ చేస్తామని నమ్మబలికి బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బు మొత్తాన్ని సైబర్ నేరగాళ్లు కాజేశారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉంటున్నా నూరిళ్ల, రిజ్వనా అనే దంపతులను సైబర్ నేరగాళ్లు భలే బురిడీ కొట్టించారు. నూరిళ్ల, భార్య రిజ్వనాకు చెరో ఒకటి RBL బ్యాంకు నుండి క్రెడిట్ కార్డులు ఇంటికి వచ్చాయి. ఆ తరువాత వాటిని యాక్టివేట్ చేయాలని సైబర్ నేరగాళ్ళు భార్య, భర్తలకు ఇద్దరికీ కాల్ చేసి నమ్మబాలికారు. వారిని నమ్మిన నూరిళ్ల తన సెల్ ఫోన్‌కు వచ్చిన ఓటీపీలు వారికీ చెప్పడంతో వెంటనే అకౌంట్ నుండి మొదటిసారి రూ.51,445,రెండవ సారి రూ.51,475 ఇలా విడతల వారీగా రూ.1,85,000 నగదు మొత్తం కాజేశారు. తన అకౌంట్ నుండి డబ్బులు కట్ అవడాన్ని గమనించిన నూరిళ్ల తాను మోసపోయానని గ్రహించారు. దీంతో సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇలాంటి ఫేక్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..