Today Cotton Price: తెలుగు రాష్ట్రాల్లో ‘తెల్ల బంగారం’ జిగేలు.. పత్తి రైతులకు కాసుల పంట

పత్తి రైతుల పంట పండింది. తెల్ల బంగారానికి కాసుల పంట పండుతోంది. ఎన్నడూ లేని విధంగా రికార్డ్‌ ధర పలుకుతోంది.

Today Cotton Price: తెలుగు రాష్ట్రాల్లో తెల్ల బంగారం జిగేలు.. పత్తి రైతులకు కాసుల పంట
Cotton

Updated on: Dec 29, 2021 | 9:37 AM

పత్తి రైతుల పంట పండింది. తెల్ల బంగారానికి కాసుల పంట పండుతోంది. ఎన్నడూ లేని విధంగా రికార్డ్‌ ధర పలుకుతోంది. ప్రజంట్ మార్కెట్‌లో పత్తికి మంచి డిమాండ్‌ ఉంది.  కరీంనగర్‌ జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో పత్తి క్వింటాల్‌ 8,720రూపాయలు పలికింది. మద్దతు ధర కంటే ఇది 2,695రూపాయలు ఎక్కువ. దీంతో తాము పండించిన పంటకు మంచి ధర రావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు రైతులు.

ఇక అటు కర్నూలు జిల్లా ఆదోని కాటన్ మార్కెట్ లో పత్తి ధరలు రికార్డులకెక్కాయి. ఇదివరకు ఎప్పుడూ ఎక్కడ పలకని ధర ఆదోనిలో నమోదైంది. క్వింటాల్ పత్తి 9,040 ధర పలికింది. దీంతో మార్కెట్లో విక్రయానికి పత్తిని భారీగా తరలిస్తున్నారు రైతులు. నాణ్యమైన పత్తికి ప్రైవేట్‌ వ్యాపారులు రూ.8 వేల దాకా ఇచ్చి గ్రామాల్లోనే కొనుగోలు చేస్తున్నారు.  పత్తి క్వింటా రూ.10 వేలు దాటే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రోజు రోజుకూ ధరలు ఊపందుకోవడంతో పత్తి కొనేందుకు వ్యాపారులు కూడా పోటీ పడుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో పత్తి పంట దెబ్బతినడం, దక్షిణాది రాష్ట్రాల్లోపత్తి నాణ్యతగా ఉండటం వల్ల మంచి ధర లభిస్తోందని మార్కెటింగ్‌ అధికారులు చెప్తున్నారు.

Also Read: Pandugappa Fish: వలకు చిక్కిన భారీ పండుగప్ప.. ఎంత ధర పలికిందంటే..?

రెక్కీ చేసింది అతడే అని ప్రచారం.. రాధాకు చంద్రబాబు ఫోన్