Corona AP: ఏపీని వదలని కరోనా రక్కసి.. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులు, మరణాలు ఎన్నంటే.!

Coronavirus Cases In AP: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 23,160 పాజిటివ్ కేసులు...

Corona AP: ఏపీని వదలని కరోనా రక్కసి.. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులు, మరణాలు ఎన్నంటే.!
Coronavirus Cases In AP

Updated on: May 19, 2021 | 7:23 PM

Coronavirus Cases In AP: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 23,160 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 14,98,532కి చేరింది. ఇందులో 2,09,736 యాక్టివ్ కేసులు ఉండగా.. 12,79,110 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న వైరస్ కారణంగా రాష్ట్రంలో 106 మంది మృతి చెందారు. దీనితో మొత్తం మరణాల సంఖ్య 9686కు చేరుకుంది. ఇక నిన్న 24,819 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. నేటితో రాష్ట్రవ్యాప్తంగా 1,82,41,37 సాంపిల్స్‌ను పరీక్షించారు.

నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 2334, చిత్తూరు 2670, తూర్పుగోదావరి 3528, గుంటూరు 1501, కడప 1221, కృష్ణా 1496, కర్నూలు 1310, నెల్లూరు 1239, ప్రకాశం 1590, శ్రీకాకుళం 1440, విశాఖపట్నం 2007, విజయనగరం 945, పశ్చిమ గోదావరి 1879 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.