Corona Vaccine Effect: దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతుండగా, కొందరికి స్వల్ప అస్వస్థతకు గురవుతున్నారు. ఏపీలోని ఒంగోలు రిమ్స్ డెంటల్ డాక్టర్‌గా పని చేస్తున్న ధనలక్ష్మీ గత మూడు రోజుల కిందట వ్యాక్సిన్ తీసుకోగా, అస్వస్థతకు గురైంది. తాజాగా పరిస్థితి విషమించడంతో ఆమెను మెరుగైన చికిత్స కోసం చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. కోవిడ్ విధులను విజయవంతంగా నిర్వహించిన వైద్యురాలు ధనలక్ష్మీ శనివారం వ్యాక్సిన్ తీసుకున్నారు. అనంతరం ఆమె అస్వస్థతకు గురవడంతో రిమ్స్ ఆస్పత్రికి తరలించగా, మెరుగైన వైద్యం కోసం ఒంగోలులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు అప్పటికి ఆమె పరిస్థితి మరింత విషమంగా ఉండటంతో చెన్నైలోని అపోలో ఆప్పత్రికి తరలించారు. కాగా, ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని కలెక్టర్ భాస్కర్ తెలిపారు.
కాగా, దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ విజయవంతంగా కొనసాగుతుండగా, అక్కడక్కడ కొందరికి స్వల్ప అస్వస్థతకు గురవుతున్నారు. చిన్న చిన్న సమస్యలు ఎదురైనా ఎలాంటి భయాందోళన చెందవద్దని పరిశోధకులు చెబుతున్నారు.
Also Read: Covid-19 Effect: కరోనా నుంచి కోలుకున్న తర్వాత అనేక అనారోగ్య సమస్యలు.. తాజా పరిశోధనలో వెల్లడి