
లాక్‌డౌన్ 5.0లో భాగంగా కేంద్రప్రభుత్వం పలు సడలింపులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు దేశ వ్యాప్తంగా పలు ఆలయాలు తెరిచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాజాగా ఈ నెల 8 నుంచి తిరుమల శ్రీవారి దర్శనం భక్తులకు అందుబాటులోకి రాబోతుంది. ఉదయం 6.30 నుంచి రాత్రి 7.30 గంటల సమయంలో భక్తులకు దర్శనాలు కల్పించబోతున్నట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పేర్కొన్నారు. 8, 9వ తేదీన ఆలయం తెరిచినా.. స్థానికులు, ఉద్యోగులకే అనుమతి ఉంటుంది. ఈ నెల 11వ తేదీ నుంచి సాధారణ భక్తులను అనుమతిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కామెంట్స్:
– 11వ తేదీ నుంచి గంటకు 500 మందికి దర్శనాలు కల్పిస్తాం
– 50 శాతం ఆన్‌లైన్‌లోనూ, మరో యాభై శాతం ఆఫ్‌లైన్‌లోనూ దర్శనాలపై రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇస్తున్నాం
– ఆన్‌లైన్లో లేదా ఆఫ్‌లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే దర్శనాలకి అనుమతి
– వచ్చిన భక్తులందరికీ అలిపిరి గేటు దగ్గర కోవిడ్ పరీక్షలు చేసాకే కొండపైకి అనుమతిస్తాం
– కొండపైకి వచ్చాక కూడా.. క్యూలైన్లలోకి వెళ్లేముందు కూడా ధర్మల్ స్క్రీనింగ్ చేస్తాం
– లగేజ్ మొత్తాన్ని కూడా శానిటైజ్ చేసి పంపుతాము
– అలిపిరి మెట్ల మార్గం ద్వారా మాత్రమే.. నడక ద్వారా వచ్చే భక్తులని అనుమతి ఇస్తాం
– ఆన్‌లైన్లో రిజిస్టర్ చేసుకున్న వారికి కొండపై వసతి గృహాల్లో అవకాశం
– ఒక్కో గదికి ఇద్దరిని మాత్రమే అనుమతి ఇస్తున్నాం
– ఆన్ లైన్లోనే రూమ్‌ను బుక్ చేసుకోవాలి
– రూమ్ ఖాళీ చేశాక పూర్తిగా శాని టైజ్ చేసాకే ఇంకొకరికి కేటాయింపు
– వసతి గృహాల్లో కేవలం ఒక్కరోజుకి మాత్రమే అనుమతి
– కొండపై పుష్కరిణిలో స్నానాలకి అనుమతి లేదు
– కల్యాణ కట్టలో తలనీలాలు సమర్పించే బార్బర్ల అందరికీ పీపీఈ కిట్లు ఇస్తున్నాం
– కల్యాణ కట్టలోనూ భౌతిక దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాము.
Read More:
తెలంగాణ హోం క్వారంటైన్ న్యూ గైడ్‌లైన్స్.. ఇంట్లో ఇలా ఉండాలి..