ఏపీఎస్ ఆర్టీసీ కీల‌క నిర్ణ‌యం.. కరోనా బారిన పడిన ఆర్టీసీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక మెడికల్ కిట్లు

|

May 11, 2021 | 9:57 PM

ఏపీఎస్ ఆర్టీసీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కరోనా బారిన పడిన ఆర్టీసీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు స్పెష‌ల్ గా రూపొందించిన....

ఏపీఎస్ ఆర్టీసీ కీల‌క నిర్ణ‌యం.. కరోనా బారిన పడిన ఆర్టీసీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక మెడికల్ కిట్లు
APSRTC
Follow us on

ఏపీఎస్ ఆర్టీసీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కరోనా బారిన పడిన ఆర్టీసీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు స్పెష‌ల్ గా రూపొందించిన మెడికల్ కిట్లు ఫ్రీగా అందజేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. అన్ని డిపోలు, రీజ‌న్ మెడిక‌ల్ సెంట‌ర్ల‌లో కిట్లను అందించాలని తెలిపింది. క‌రోనా పరీక్ష ఫలితం రాకపోయినా కొవిడ్ సింట‌మ్స్ కల్గిన ఉద్యోగులకు మెడికల్ కిట్లను అందించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. కొవిడ్ మెడికల్ కిట్ల వినియోగాన్ని అన్ని జిల్లాల్లోని ఆర్టీసీ ఆర్​ఎంలు స్వయంగా రోజువారీగా సమీక్షించాలని సూచించారు.

ఎంప్లాయిస్ కు సకాలంలో కిట్లు అందేలా చర్యలు తీసుకోవాలని, రిపోర్టును ఎప్పటికప్పుడు సీఎం కార్యాలయానికి అందించాలని తెలిపారు. ఎక్కడా దుర్వినియోగం కాకుండా.. అర్హులైన సిబ్బందికి మాత్రమే ఈ మెడికల్ కిట్లు అందించాలని ఆదేశాల్లో స్ప‌ష్టం చేశారు. ఈ నిర్ణయంపై… ఆర్టీసీలో ఉద్యోగ సంఘాలు ఎన్ఎంయూ, ఎంప్లాయిస్ యూనియన్, కార్మిక పరిషత్ నేతలు ఆర్టీసీ ఎండీకి ధన్యవాదాలు తెలిపారు.

Also Read:  తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. పదో తరగతి విద్యార్థులను పాస్ చేస్తూ జీవో జారీ..

ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో కొవిడ్ చికిత్స ఫీజులు నిర్ణయిస్తూ జ‌గ‌న్ స‌ర్కార్ ఉత్త‌ర్వులు