Covid Curfew: ఏపీలో మళ్లీ కర్ఫ్యూ పొడిగింపు.. ఆ సమయంలో ఎవరూ బయటకు రావద్దు.. ఎక్కడో తెలుసా..

| Edited By: Ram Naramaneni

Aug 15, 2021 | 3:08 PM

ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ కర్ఫ్యూను మరో వారంపాటు పొడిగించారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటి వరకు అమలు చేస్తున్న రాత్రి కర్ఫ్యూను..

Covid Curfew: ఏపీలో మళ్లీ కర్ఫ్యూ పొడిగింపు.. ఆ సమయంలో ఎవరూ బయటకు రావద్దు.. ఎక్కడో తెలుసా..
Ap Curfew
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ కర్ఫ్యూను మరో వారంపాటు పొడిగించారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటి వరకు అమలు చేస్తున్న రాత్రి కర్ఫ్యూను ఈనెల 21 వరకు కొనసాగించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. కొవిడ్‌ పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఏపీలో కరోనా కేసులు సంఖ్య రోజు రోజుకు తగ్గుతూ వస్తోంది. శనివారం ఏపీ వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 69,088 సాంపిల్స్ పరీక్షించగా.. 1,535 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కొత్తగా గడిచిన 24గంటల్లో మరో 20 మంది కోవిడ్‌ బాధితులు ప్రాణాలను కోల్పోయారు. ఇక, గడిచిన 24 గంటల సమయంలో 2,075 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారు.

ఇక, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,19,92,191కి పెరగగా.. కోలుకున్నవారి సంఖ్య 1,19,60,350కి చేరింది.. ఇప్పటి వరకు కోవిడ్ బారినపడి 13,631 మంది మృతి చెందితే.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 18,210 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని.. నేటి వరకు 2,55,95,949 సాంపిల్స్‌ పరీక్షించామని బులెటిన్‌లో పేర్కొంది ఏపీ ప్రభుత్వం.

ఇక, కోవిడ్ మహమ్మారి దాటికి గడిచిన 24 గంటల వ్యవధిలో చిత్తూర్ జిల్లాలో ముగ్గురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు, నెల్లూరు జిల్లాలో ముగ్గురు, తూర్పు గోదావరి జిల్లాలో ఇద్దరు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఇద్దరు, గుంటూరు జిల్లాలో ఒక్కరు, కడప, విశాఖపట్నం జిల్లాలో ఒక్క రు మరణించారు.

ఇవి కూడా చదవండి: Barack Obama Video: ఒబామా‌ను ఇరుకున పెట్టిన వీడియో లీక్.. క్షమాపణ కోరిన అమెరికా సింగర్

IND vs ENG 2nd Test Day 3 Highlights: ముగిసిన ఇంగ్లండ్ ఇన్నింగ్.. 391 పరుగులకు ఆలౌట్..