ఏపీ వాణిజ్య పన్నులు, స్టాంపులు- రిజిస్ట్రేషన్ల విభాగాలను ఆర్ధిక శాఖ పరిధిలోకి తీసుకువస్తూ ఉత్తర్వులు

Finance Departments: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాణిజ్య పన్నులు, స్టాంపులు- రిజిస్ట్రేషన్ల విభాగాలను ఆర్ధిక శాఖ పరిధిలోకి తీసుకువస్తూ..

ఏపీ వాణిజ్య పన్నులు, స్టాంపులు- రిజిస్ట్రేషన్ల విభాగాలను ఆర్ధిక శాఖ పరిధిలోకి తీసుకువస్తూ ఉత్తర్వులు

Updated on: Jul 09, 2021 | 6:56 AM

Finance Departments: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాణిజ్య పన్నులు, స్టాంపులు- రిజిస్ట్రేషన్ల విభాగాలను ఆర్ధిక శాఖ పరిధిలోకి తీసుకువస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇప్పటి వరకూ రెవెన్యూ శాఖ పరిధిలో ఉన్న రెండు విభాగాలు ఆర్థిక పరిధిలోకి తీసుకువచ్చింది. ఇక నుంచి వాణిజ్య పన్నుల విభాగంతో పాటు రిజిస్ట్రేషన్లు-స్టాంపుల విభాగం రెవెన్యూ శాఖ నుంచి ఆర్ధిక శాఖకు మార్చినట్టుగా ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్, రిజిస్ట్రేషన్లు స్టాంపుల శాఖ డైరెక్టర్, ఐజీ కార్యాలయాలు, ఏపీ వ్యాట్ ట్రైబ్యునల్ లాంటి సంస్థలన్నీ ఆర్ధికశాఖ నియంత్రణలో పనిచేస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆర్ధిక వనుల నిర్వహణను సులభతరం చేసేందుకు ఈ మార్పులు చేసినట్టుగా వెల్లడించింది. ఈ అంశాలను ఆర్ధిక శాఖలోని కార్యదర్శి గుల్జార్ పర్యవేక్షిస్తారని స్పష్టం చేసింది.

ఇవీ కూడా చదవండి:

Police Complaints Authority : తెలుగు రాష్ట్రాల్లో పోలీసు ఫిర్యాదుల అథారిటీకి సభ్యుల నియామకం..

Anakapalli flyover: అనకాపల్లి ఫ్లై ఓవర్ కుప్పకూలడంలో వెలుగు చూసిన సంచలన విషయాలు

Sajjala: షర్మిల పార్టీపై స్పందించాల్సిన అవసరంలేదు : సజ్జల