Weather Report of AP: లక్ష ద్వీపం దాని పరిసర ప్రాంతాల మీద ఉన్న అల్పపీడనం బలపడిందని అమరావతి కేంద్రంగా ఉన్న భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అల్ప పీడనం ఈ రోజు వాయు గుండంగా మారి, లక్ష ద్వీపం సమీపంలోని అమిని దీవి కి దక్షిణ నైరుతి దిశగా 80 కిలోమీటర్ల దూరంలో, కన్నూరు(కేరళ)కు పశ్చిమ నైరుతి దిశగా 360 కిలోమీటర్ల దూరంలో, వెరావెల్ (గుజరాత్)కు దక్షిణ ఆగ్నేయ దిశగా 1170 కి. మీ. దూరంలో కేంద్రీకృతమై ఉందన్నారు.
ఉత్తర-దక్షిణ ద్రోణి, ఆగ్నేయ మధ్య ప్రదేశ్ దాని పరిసర ప్రాంతాల మీద ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా, దక్షిణ తమిళనాడు వరకు వ్యాపించి, సముద్ర మట్టానికి 9 కిలోమీటర్ల ఎత్తులో ఉందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా తక్కువ ఎత్తులో దక్షిణ, ఆగ్నేయ, నైరుతి గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
కాగా, ఈ అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు రోజుల వరకు వాతావరణంలో విభిన్న మార్పులు ఉంటాయని తెలిపారు. ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం ప్రాంతాల్లో ఇవాళ ఈ రోజు, శనివారం నాడు ఉరుములు, మెరుపులతో పాటు, ఒకటి లేదా రెండు చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఆదివారం నాడు ఉరుములు, మెరుపులతో పాటు, కొన్ని చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రాంతంలో ఇవాళ ఉరుములు, మెరుపులతో పాటు, ఒకటి లేదా రెండు చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. శనివారం నాడు ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇక ఆదివారం నాడు ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
రాయలసీమలో ఇవాళ ఉరుములు, మెరుపులతో పాటు, ఒకటి లేదా రెండు చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. శనివారం, ఆదివారం నాడు ఉరుములు, మెరుపులతో పాటు ఈదూరు గాలులతో కూడిన భారీ వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Also read:
ఇద్దరు తోడికోడళ్ల మధ్య ఘర్షణ.. అడ్డు వెళ్లిన బావను కత్తితో పొడిచి చంపిన మరదలు.. ఎక్కడంటే..