వైరల్‎గా మారిన ఎన్నికల ఆహ్వాన పత్రిక.. విన్నూత్న ప్రయత్నం ఎందుకంటే..

ఎన్నికల పండుగకు ఆహ్వాన పత్రిక పంపిన జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా. ఏపీలో ఎన్నికల వేళ ఓటర్లను ఆకట్టుకునేందుకు విన్నూత్న ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా ఆహ్వాన పత్రిక స్థానికులను ఆకట్టుకుంటోంది. మే 13న ఓటు వేసేందుకు రావాలంటూ ఓటర్లకు ఆహ్వానం పంపారు జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా. దీని కోసం ప్రత్యేకంగా ఒక ఆహ్వాన పత్రికను తయారు చేశారు.

వైరల్‎గా మారిన ఎన్నికల ఆహ్వాన పత్రిక.. విన్నూత్న ప్రయత్నం ఎందుకంటే..
Himansu Shukla

Updated on: May 10, 2024 | 12:44 PM

ఎన్నికల పండుగకు ఆహ్వాన పత్రిక పంపిన జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా. ఏపీలో ఎన్నికల వేళ ఓటర్లను ఆకట్టుకునేందుకు విన్నూత్న ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా ఆహ్వాన పత్రిక స్థానికులను ఆకట్టుకుంటోంది. మే 13న ఓటు వేసేందుకు రావాలంటూ ఓటర్లకు ఆహ్వానం పంపారు జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా. దీని కోసం ప్రత్యేకంగా ఒక ఆహ్వాన పత్రికను తయారు చేశారు. అచ్చం పెళ్లి శుభలేఖ ఉన్న తరహాలో ముద్రించారు.

మే 13వ తేదీన ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఎన్నికల పోలింగ్‎లో పాల్గొని ఓటు వేయాలని జిల్లా ఓటర్లను కోరారు. ప్రజాస్వామ్య పద్దతిలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మీ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థుల ఎన్నికల మహోత్సవానికి హాజరై మీకు నచ్చిన వారికి ఓటు వేయాలని పత్రికలో పేర్కొన్నారు. అందరికీ అర్ధం అయ్యేలా తెలుగు, ఇంగ్లీష్ రెండు భాషల్లో ఆహ్వాన పత్రికను ముద్రించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వాట్సప్ గ్రూపులలో ట్రేడింగ్‎గా మారింది ఈ ఎన్నికల ఆహ్వాన పత్రిక.

Election Invitation

Loading...
Unable to load recommendations.
Follow Us