గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు విశాఖపట్నం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లోనే సదస్సు ప్రారంభంకానుంది. ఇవాళ, రేపు జరిగే ఈ సమ్మిట్ కోసం భారీ ఏర్పాట్లు చేసింది ఏపీ ప్రభుత్వం. దేశ విదేశాల నుంచి రాబోతున్న కార్పొరేట్ దిగ్గజాలకు కనీవినీ ఎరుగని రీతిలో రెడ్ కార్పెట్ ఆహ్వానం పలుకుతోంది. రెండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల సాధనే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం దీన్ని నిర్వహిస్తోంది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్‌కి సర్వసిద్ధమైంది. ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ వేదికగా మరికాసేపట్లో గ్లోబల్ సమ్మిట్ మొదలుకానుంది. ఈ సమ్మిట్ కు 25 దేశాల నుంచి హైకమిషనర్లు, 15వేల మంది ప్రతినిధులు. ఇండియా నుంచి 35మంది టాప్ ఇండస్ట్రియలిస్ట్‌లు, బిజినెస్ టైకూన్స్, కార్పొరేట్ దిగ్గజాలు. ఏడుగురు కేంద్ర మంత్రులు, వీవీఐపీలు.. ఇదీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌కు హాజరయ్యే టాప్ లిస్ట్. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కి వస్తోన్న అతిథుల కోసం టాప్ లెవల్‌లో అరేంజ్‌మెంట్స్ చేసింది ఏపీ ప్రభుత్వం. దేశ విదేశీ పారిశ్రామిక దిగ్గజాలతోపాటు కేంద్ర మంత్రులు, వీవీఐపీలు వస్తుండటంతో సెక్యూరిటీపరంగానూ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సుమారు 7వేల మంది పోలీసులతో నగరమంతటా మోహరించింది. ఇక, అతిథుల కోసం హెలికాప్టర్లు, లగ్జరీ కార్లను సిద్ధంగా ఉంచింది ప్రభుత్వం. ప్రముఖ హోటళ్లలో 1500లకు పైగా షూట్స్‌ని బుక్ చేసింది ప్రభుత్వం.
శుక్రవారం ఉదయం 9.45కి గ్లోబల్ సమ్మిట్ ప్రారంభంకానుంది. లేజర్ షో, ప్రార్థనా గీతం అనంతరం సమావేశ లక్ష్యాన్ని వివరించనున్న పరిశ్రమల శాఖ డైరెక్టర్ సృజన, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, పరిశ్రమల శాఖా మంత్రి అమర్, ఆర్ధిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి..మధ్యాహ్నం 1.20 కి నితిన్ గడ్కరీకీ నోట్ అడ్రస్.. 1.35 కి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభ ఉపన్యాసం ఇవ్వనున్నారు. తొలిరోజు కేంద్ర జాతీయ రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో పాటు 21 మంది కార్పొరేట్ ప్రముఖులు ప్రసంగించనున్నారు. 150కి పైగా స్టాల్స్‌తో ఏర్పాటు చేసిన పారిశ్రామిక ఎగ్జిబిషన్‌ను కేంద్ర మంత్రి గడ్కరీతో కలిసి మధ్యాహ్నం 3 గంటలకు సీఎం ప్రారంభిస్తారు.
రెండ్రోజులపాటు జరిగే ఈ సమ్మిట్‌కి ఇన్వెస్టర్స్ నుంచి ఊహించని స్పందన వచ్చింది. ఇప్పటికే 12వేలకు పైగా రిజిస్ట్రేషన్ జరిగాయ్. ఇండియాలోని టాప్-35 ఇండస్ట్రియలిస్ట్‌లు, 25 కంట్రీస్ నుంచి బిజినెస్ టైకూన్స్, హైకమిషనర్లు ఈ సమ్మిట్‌కి హాజరుకాబోతున్నారు. అంబానీ, అదానీ, మిట్టల్, బజాజ్, ఆదిత్యా బిర్లా, జిందాల్, జీఎంఆర్ లాంటి అనేకమంది పారిశ్రామిక దిగ్గజాలు 25 ప్రత్యేక విమానాల్లో ఈ సమ్మిట్‌కి రాబోతున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులుగా మంత్రులు నితిన్ గడ్కరీ, కిషన్‌రెడ్డి అటెండ్ కాబోతున్నారు.
సుదీర్ఘమైన తీర ప్రాంతం, అంతకంటే విస్తృతమైన వనరులు, 70శాతం మేన్‌పవర్, అన్నింటికీ మించి ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ పాలసీలు ఏపీ అడ్వాంటేజ్‌స్‌గా చెబుతోంది ప్రభుత్వం. ఈ సమ్మిట్ ద్వారా 2లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించడం టార్గెట్‌గా పెట్టుకుంది ఏపీ ప్రభుత్వం. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న గ్లోబల్ సమ్మిట్ ద్వారా 15 రంగాల్లో ఎంవోయూలు కుదుర్చుకోనుంది సర్కార్.
మరిన్ని ఏపీ వార్తల కోసం..