YS Jagan: ముస్లిం రిజర్వేషన్లపై టీడీపీ స్టాండ్‌ ఏంటి? ఎన్డీఏ నుంచి బయటకు వస్తారా? చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్..

చంద్రబాబుపై నేరుగా రిజర్వేషన్ల బుల్లెట్లు విసురుతూ.. మీ విధానమేంటి? ముస్లింలను మోసం చేస్తారా? ఎన్డీఏ నుంచి బయటకు వస్తారా? అంటూ ఇదే విషయాన్ని పదేపదే ప్రస్తావిస్తున్నారు. 58నెలల పాలనలో కొనసాగిన సంక్షేమాన్ని వివరిస్తూ.. మరోసారి ఫ్యాన్‌ గెలుపు అవసరాన్ని ప్రజలకు వివరించారు జగన్‌..

YS Jagan: ముస్లిం రిజర్వేషన్లపై టీడీపీ స్టాండ్‌ ఏంటి? ఎన్డీఏ నుంచి బయటకు వస్తారా? చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్..
Ys Jagan

Updated on: May 09, 2024 | 7:32 PM

ఎన్నికల ప్రచారంలో ఒక రోజు గ్యాప్ ఇచ్చిన సీఎం జగన్‌.. ఇవాళ జరిగిన మూడు సభల్లోనూ కూటమి టార్గెట్‌గా నిప్పులు చెరిగారు. ముస్లిం రిజర్వేషన్లపై టీడీపీ స్టాండ్‌ ఏంటో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. కమలానికి వంత పాడుతారా? నిలదీస్తారా చెప్పాలని నిలదీశారు. చంద్రబాబుపై నేరుగా రిజర్వేషన్ల బుల్లెట్లు విసురుతూ.. మీ విధానమేంటి? ముస్లింలను మోసం చేస్తారా? ఎన్డీఏ నుంచి బయటకు వస్తారా? అంటూ ఇదే విషయాన్ని పదేపదే ప్రస్తావిస్తున్నారు. 58నెలల పాలనలో కొనసాగిన సంక్షేమాన్ని వివరిస్తూ.. మరోసారి ఫ్యాన్‌ గెలుపు అవసరాన్ని ప్రజలకు వివరించారు జగన్‌..

దేశంలో రిజర్వేషన్లపై పెద్ద యుద్ధమే నడుస్తుంటే.. అంతకు మించిన పొలిటికల్ వార్ ఏపీలో కొనసాగుతోంది. మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు ఉండాలని సీఎం కరఖండిగా చెప్తుంటే.. కూటమి ఎలాంటి ప్రకటన చేయలేని పరిస్థితిలో ఉంది. రిజర్వేషన్లు ఉండాలని తాను చెప్పడమే కాదు.. పొలిటికల్ రిజర్వేషన్లు కల్పించి చూపానని కర్నూలు సభలో ప్రకటించారు. నలుగురు ఎమ్మెల్సీలు, ఏడుగురు మైనార్టీ అభ్యర్థులకు ఎమ్మెల్యేలుగా అవకాశం ఇచ్చామన్నారు సీఎం.

మరోవైపు రాజంపేట సభలో ఏపీకి ప్రత్యేక హోదాపై మాట్లాడిన సీఎం జగన్.. చంద్రబాబు టార్గెట్‌గా విమర్శలు ఎక్కుపెట్టారు. మోదీ, అమిత్‌షాలతో చంద్రబాబు ఎన్నికల ప్రచార సభలు ఏర్పాటు చేయించారు. పదేళ్ల క్రితం రావాల్సిన ప్రత్యేక హోదాను ఇప్పటికైనా ప్రకటిస్తామోనని ప్రజలు ఆశించారు. కాని నిరాశే మిగిలింది. రాష్ట్ర ప్రజలకు కావాల్సిన ఒక్క మాట కూడా మోదీ, అమిత్‌షా నోటి వెంట రాలేదు. మొన్నటి వరకు చంద్రబాబును విమర్శించిన మోదీ.. ఇప్పుడు పొగడ్తలతో ముంచెత్తడం ఆశ్చర్యం కలిగించిందన్నారుు సీఎం జగన్..

వీడియో చూడండి..

పేదలకు ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం చదువులు అందించడం పెత్తందార్లకు నచ్చడం లేదన్నారు సీఎం. మరి మీ పిల్లలు, మీ మనవళ్లు ఎక్కడ చదువుతున్నారని ప్రశ్నించారు.

కర్నూలు, కల్యాణదుర్గం, రాజంపేటలో సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభలు వైసీపీ శ్రేణుల్లో ఫుల్ జోష్ నింపాయి. మరోవైపు కర్నూలులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ ఫ్యాన్స్‌.. ఫ్లెక్సీలతో సందడి చేశారు. ఇద్దరు హీరోల ఫ్యాన్స్ .. వైసీపీకి ఫ్యాన్‌గా మారడం అందరి దృష్టిని ఆకర్షించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..