CM Jagan: ‘మరో గ్రూప్‌ని తీసుకొస్తాం, మరిన్ని ఉద్యోగవకాశాలు’.. గండికోటలో సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు..

|

Jul 09, 2023 | 1:32 PM

Andhra Pradesh: సీఎం జగన్‌ తన రెండో రోజు కడప జిల్లా పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే గండికోటలో నిర్మిస్తున్న ఒబెరాయ్‌ హోటల్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘గండికోటను ప్రపంచానికి పరిచయం చేస్తున్నాం..

CM Jagan: ‘మరో గ్రూప్‌ని తీసుకొస్తాం, మరిన్ని ఉద్యోగవకాశాలు’.. గండికోటలో సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
CM Jagan
Follow us on

Andhra Pradesh: సీఎం జగన్‌ తన రెండో రోజు కడప జిల్లా పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే గండికోటలో నిర్మిస్తున్న ఒబెరాయ్‌ హోటల్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘గండికోటను ప్రపంచానికి పరిచయం చేస్తున్నాం. ఏపీకి ఒబెరాయ్‌ లాంటి స్టార్‌ గ్రూప్‌ రావడం, సెవెన్‌స్టార్‌ హోటల్స్‌ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. గండికోటను గ్లోబల్‌ టూరిజం మ్యాప్‌లోకి తీసుకెళ్తున్నాం. గండికోటకు మరో గ్రూప్‌ని కూడా తీసుకొస్తాం. కొప్పర్తి డిక్సన్ కంపెనీతో మరో 1000 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి’ అని అన్నారు. ఈ సందర్బంగానే విశాఖ, తిరుపతిలో కూడా ఏర్పాటు చేయబోయే ఒబెరాయ్‌ హోటల్స్‌కు గండికోట వేదికగా శంకుస్థాపన చేశారు.

ఇంకా మనం ఉండే విధానాన్ని బట్టే కంపెనీలు వస్తాయన్నది జమ్మలమడుగు నేతలు గుర్తుంచుకోవాలన్నారు సీఎం జగన్‌. కొద్దోగొప్పో మనస్ఫర్థలు వస్తుంటాయి.. వాటిని కూర్చుని మాట్లాడుకుంటే సాల్వ్‌ అవుతాయని చెప్పారు. అప్పుడు మాత్రమే పెట్టుబడులకు ఆస్కారం ఉంటుందంటూ జమ్మలమడుగు నేతలను హెచ్చరించారు సీఎం జగన్.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..