YS Jagan: విలన్లకి హీరోలు బచ్చాల్లానే కనిపిస్తారు.. సీఎం జగన్ సిద్ధం సభల్లో ఆ నలుగురే స్పెషల్..

అనకాపల్లి సభలో ఎంపీ అభ్యర్థి ముత్యాల నాయుడిని ప్రత్యేకంగా పరిచయం చేశారు సీఎం జగన్. ఇప్పటి వరకూ జరిగిన మేమంతా సిద్ధం సభల్లో నలుగురిని మాత్రమే స్పెషల్‌ ఇంట్రడ్యూస్ చేశారు జగన్. అనకాపల్లిలో జరిగిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడిని జగన్ ప్రత్యేకంగా పరిచయం చేశారు.

YS Jagan: విలన్లకి హీరోలు బచ్చాల్లానే కనిపిస్తారు.. సీఎం జగన్ సిద్ధం సభల్లో ఆ నలుగురే స్పెషల్..
Ys Jagan

Updated on: Apr 20, 2024 | 9:57 PM

అనకాపల్లి సభలో ఎంపీ అభ్యర్థి ముత్యాల నాయుడిని ప్రత్యేకంగా పరిచయం చేశారు సీఎం జగన్. ఇప్పటి వరకూ జరిగిన మేమంతా సిద్ధం సభల్లో నలుగురిని మాత్రమే స్పెషల్‌ ఇంట్రడ్యూస్ చేశారు జగన్. అనకాపల్లిలో జరిగిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడిని జగన్ ప్రత్యేకంగా పరిచయం చేశారు. ప్రత్యర్థి పార్టీ నుంచి పోటీ చేస్తున్న వ్యక్తి నాన్‌ లోకల్‌ అంటూ సెటైర్లు వేశారు. ఇప్పటికే తన క్యాబినెట్‌ లో బూడి ముత్యాలనాయుడు ఉప ముఖ్యమంత్రిగా సమర్థవంగా బాధ్యతలు నిర్వర్తించారంటూ ప్రశంసించారు. రానున్న ఎన్నికల్లో కూడా బూడి ముత్యాలనాయుడిని అనాకపల్లి ఎంపీ అభ్యర్ధిగా గెలిపిస్తే పార్లమెంట్‌కి మంచి జరుగుతుందని.. అభివృద్ధి జరుగుతుందని చెప్పారు సీఎం జగన్. ఇప్పటి వరకూ జరిగిన మేమంతా సిద్ధం సభల్లో సీఎం జగన్.. ముగ్గురిని స్పెషల్‌గా పరిచయం చేశారు. మొదట కుప్పంలో వైసీపీ అభ్యర్థి భరత్‌ని గెలిపిస్తే.. తన క్యాబినెట్‌లో మంత్రిగా చేస్తానని అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు. అలాగే మంగళగిరిలోను వైసీపీ అభ్యర్థిని గెలిపిస్తే మంత్రి చేస్తానన్నారు. మొన్న జరిగిన కాకినాడ సభలో పిఠాపురం అభ్యర్థిని వంగా గీతను సైతం స్పెషల్ పరిచయం చేశారు జగన్. లోకల్‌గా స్టార్ కావాలో.. సినిమా స్టార్ కావాలో ఆలోచించాలన్నారు జగన్..

చంద్రబాబు, పవన్ పై ఫైర్..

ఇక అనకాపల్లి చింతపాలెంలో సభలో ప్రతిపక్ష పార్టీలపై సీఎం జగన్ ఫైర్ అయ్యారు. పెత్తందారులపై యుద్ధానికి ప్రజలు సిద్ధంగా ఉండాలంటూ సీఎం జగన్‌ పిలుపునిచ్చారు. చంద్రబాబు తన మీద రాళ్లు వేయమని చెబుతున్నారన్నారు. చంద్రబాబు, దత్తపుత్రుడు, చంద్రబాబు వదిన ఎజెండా అదే అన్నారు జగన్‌. తనను కొట్టడానికి, హాని చేయడానికి వాళ్లకు అధికారం కావాలట అని కామెంట్‌ చేశారు. చంద్రబాబు తనను బచ్చా అని అంటున్నారని, దీంతో కృష్ణుడిని బచ్చా అనుకున్న కంసుడు గుర్తొస్తున్నారని కామెంట్‌ చేశారు జగన్‌. హనుమంతుడిని బచ్చా అనుకున్న రావణుడు గుర్తొస్తున్నారన్నారు. ఓడిపోయే కాలం వచ్చినప్పుడు, విలన్‌లు అందరికీ హీరోలు బచ్చాల్లా కనిపిస్తారన్నారు జగన్.

పొత్తుల కోసం ఎందుకు ఎగబడుతున్నారని కూటమి నేతలను ప్రశ్నించారు సీఎం జగన్‌. పది మందిని ఎందుకు పోగేసుకోవాల్సి వచ్చిందని ప్రశ్నించారు. తనకు తోడు దేవుడు, కోట్ల మంది పేదలు ఉన్నారని తెలిపారు జగన్‌. తనపై పోటీ చేయడానికి, చంద్రబాబు ఒక్కడికి ధైర్యం చాలడం లేదా అని ప్రశ్నించారు. గతంలో ఎప్పుడైనా వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు చూశారా? అని ప్రశ్నించారు సీఎం జగన్. వృద్ధులకు ఒకటో తేదీనే ఇంటికే పెన్షన్‌ వస్తోందని, గతంలో అమ్మఒడి లాంటి పథకం చూశారా? అని ప్రజలను ప్రశ్నించారు. 2 కోట్ల 70 లక్షల మంది మహిళల ఖాతాల్లో అమ్మ ఒడి డబ్బులు జమచేశామన్నారు.

అనకాపల్లి జిల్లా చింతపాలెంలో జరిగిన సీఎం జగన్‌ బహిరంగ సభకు జనం భారీగా తరలివచ్చారు. దీంతో జనాదరణను చూసి ఆనందం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి. ఉత్తరాంధ్రలో రెండు సముద్రాలు కనిపిస్తున్నాయన్నారు. ఒకటి బంగాళాఖాతం, రెండు జనసముద్రం అని కామెంట్‌ చేశారు.

వైసీపీలోకి టీడీపీ నేతలు..

మేమంతా సిద్దం యాత్ర సందర్భంగా పలువురు టీడీపీ, జనసేన నాయకులు జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరుతున్నారు. టీడీపీ నేతలు రుత్తల ఎర్ర పాత్రుడు, వి లక్ష్మీ, జనసేన నేత డీఎంఆర్ శేఖర్ జగన్‌ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. అనకాపల్లి నుంచి TDP టికెట్‌ ఆశించి భంగపడ్డ యువ నాయకుడు అడారి కిశోర్‌.. సీఎం జగన్‌ సమక్షంలో YCPలో చేరారు. గత 20 ఏళ్లుగా చంద్రబాబు కోసం పని చేసినా, పార్టీలో సరైన గౌరవం దక్కలేదన్నారు. YCPలో మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తున్నానన్నారు . జగన్‌ను కలిసేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా తరలివచ్చారు. పాయకరావుపేట, యలమంచిలి, అనకాపల్లి, నర్సీపట్నం, మాడుగుల, చోడవరం నియోజక వర్గాలకు చెందిన వైయస్సార్సీపీ నేతలు జగన్‌ను కలిశారు ఎన్నికల్లో విజయంపై దిశానిర్దేశం చేశారు జగన్‌..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..