CM Jagan: పొత్తులపై సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు.. మాకు ఎవరితోనూ పొత్తులు ఉండవు.. జనంతోనే మా పొత్తు.

తామకు కేవలం జనంతోనే పొత్తు ఉంటుందని తేల్చి చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబులా తాను దుష్టచతుష్టయాన్ని నమ్ముకోలేదని.. ప్రజల్నే నమ్ముకున్నానని స్పష్టత ఇచ్చారు. తాను ఏం చెబుతానో..

CM Jagan: పొత్తులపై సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు.. మాకు ఎవరితోనూ పొత్తులు ఉండవు.. జనంతోనే మా పొత్తు.
Cm Jagan

Updated on: Nov 30, 2022 | 2:14 PM

పొత్తులపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తమకు ఎవరితోనూ పొత్తులు ఉండవని తేల్చి చెప్పారు. మదనపల్లెలో బటన్ నొక్కి.. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 694 కోట్ల రూపాయాలు జమచేశారు. ఈ సంర్భంగా ఆయన మాట్లాడుతూ.. తామకు కేవలం జనంతోనే పొత్తు ఉంటుందని తేల్చి చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబులా తాను దుష్టచతుష్టయాన్ని నమ్ముకోలేదని.. ప్రజల్నే నమ్ముకున్నానని స్పష్టత ఇచ్చారు. తాను ఏం చెబుతానో, అదే చేసి చూపిస్తానన్నారు. ప్రస్తుతం రాక్షసులతో, మారీచులతో యుద్ధం చేస్తున్నామన్నారు విమర్శించారు సీఎం జగన్.

విపక్షాల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అక్షరాలు రాయడం, చదవడం మాత్రమే విద్యకు పరమార్ధం కాదు. తనకు తానుగా ప్రతి పాప, ప్రతిబాబు ఆలోచించి నిర్ణయాలు తీసుకునే శక్తిని ఇవ్వగలుగడమే విద్యకు పరమార్థమని ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బల్ట్‌ ఐనిస్టిన్‌ చక్కగా చెప్పారన్నారు.

ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు శుభవార్తను అందించారు. మదనపల్లెలో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 694 కోట్ల రూపాయాలు జమచేశారు. దీంతో మొత్తం 11.02 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. మొత్తం మీద ఇప్పటి వరకు జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాల కింద 12,401 కోట్లు విడుదల చేశారు.

కానీ ఈ రోజు రాజకీయ విషయాల్లోకి వస్తే ఈ రోజు కొరబడిన అలాంటి ఆలోచన శక్తి, కొరవడిన వివేకం ప్రతిపక్షాలకు ఎప్పటికైనా రావాలి. పేదల పిల్లలు ఇంగ్లీష్‌ మీడియం చదవకూడదని కోరుకుంటున్న ప్రతిపక్షాల వైఖరి మారాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా అన్నారు.

మరిన్ని ఏపీ న్యూస్ కోసం