Cm Jagan Birthday: చరిత పుటలు కోరుకున్న కొత్త కథవు నీవే..అధిపతి అంటూ పాటతో సీఎం జగన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు
Cm Jagan Birthday: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి నేడు తన 49 వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి సీఎం కు డిఫరెంట్ గా బర్త్ డే విషెష్ ను చెప్పారు. చరిత పుటలు కోరుకున్న..
Cm Jagan Birthday: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి నేడు తన 49 వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి సీఎం కు డిఫరెంట్ గా బర్త్ డే విషెష్ ను చెప్పారు. చరిత పుటలు కోరుకున్న కొత్త కథవు నీవే.. విధి కూడా తలవంచే సంకల్పం నీదే.. ఆంధ్ర నాట ప్రగతికి విద్యావైనవే.. జనం గుండెలో నిలిచే జగన్మోహనుడివే .. అంటూ ఓ సాంగ్ ని రిలీజ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ పై ‘అధిపతి’ అనే టైటిల్‌తో చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఓ సాంగ్ ని ప్రెజెంట్ చేశారు. సాయికుమార్ మాటలతో మొదలైన ‘వర్థిల్లు.. వెయ్యేళ్లు’ పాట ఆడియో సీడీని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. ఈ పాటను ఎం.కృష్ణవేణి రాశారు. ప్రముఖ సినీ గాయకుడు కారుణ్య పాడగా.. కార్తీక్ సంగీతమందించారు.
సీఎం పుట్టిన రోజు సందర్భంగా పలువురు విభిన్న రీతుల్లో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. జననేత జనహృదయ నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని మోడీ సహా ప్రముఖులు జగన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీ శ్రేణులు తమ ప్రియతమ నేత సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు.