YS Jagan: లాస్ట్‌ పంచ్‌.. ఫినిషింగ్ టచ్.. పిఠాపురంలో సీఎం జగన్.. లైవ్..

|

May 11, 2024 | 5:51 PM

ఎన్నికల ప్రచారంలో లాస్ట్‌పంచ్‌ను పిఠాపురంలో చూపించబోతున్నారు సీఎం జగన్‌. ఈ రోజు చిలకలూరిపేట, కైకలూరు సభల్లో ప్రసంగించిన జగన్‌..కాసేపట్లో పిఠాపురం సభలో పాల్గొనబోతున్నారు. పవన్‌ పోటీ చేస్తున్న పిఠాపురంలో జగన్‌ ఏం చెప్పబోతున్నారన్న ఆసక్తి నెలకుంది.

YS Jagan: లాస్ట్‌ పంచ్‌.. ఫినిషింగ్ టచ్.. పిఠాపురంలో సీఎం జగన్.. లైవ్..
Ys Jagan
Follow us on

ఎన్నికల ప్రచారంలో లాస్ట్‌పంచ్‌ను పిఠాపురంలో చూపించబోతున్నారు సీఎం జగన్‌. ఈ రోజు చిలకలూరిపేట, కైకలూరు సభల్లో ప్రసంగించిన జగన్‌..కాసేపట్లో పిఠాపురం సభలో పాల్గొనబోతున్నారు. పవన్‌ పోటీ చేస్తున్న పిఠాపురంలో జగన్‌ ఏం చెప్పబోతున్నారన్న ఆసక్తి నెలకుంది. విస్తృత పర్యటనలతో ఎన్నికల ప్రచార భేరిలో దుమ్ము రేపిన సీఎం జగన్‌.. చివరి 12రోజుల్లో 34 సభల్లో పాల్గొని కేడర్‌లో జోష్ నింపారు. తన 59 నెలల పాలనలో జరిగిన సంక్షేమాన్ని వివరిస్తూనే ప్రత్యర్థులపై పంచ్‌లతో సాగిన సీఎం జగన్‌ ప్రసంగాలు..పిఠాపురం సభతో ముగియనున్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో ఆఖరి ప్రచార సభలో సీఎం జగన్‌ ఎలాంటి పంచులు పేలుస్తారో అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

ఎన్నికల కోసం పార్టీని ముందు నుంచే ‘సిద్ధం’ చేస్తూ వచ్చిన జగన్‌.. 44 రోజుల్లో ఏకంగా 118 నియోజకవర్గాల్లో ప్రచారం చేసి రికార్డు సృష్టించారు. సిద్ధం సభలు, మేమంతా సిద్ధం బస్సు యాత్ర, ప్రచార సభలతో జనంలోకి వెళ్లారు. తన సభలకు వచ్చిన ప్రజలకు కృతజ్ఞతలతో ప్రసంగాలను మొదలుపెట్టి.. తనకు ఓటేస్తే పథకాల కొనసాగింపు, అదే చంద్రబాబుని నమ్మి ఓటేస్తే ఏం జరుగుతుందో గతాన్ని గుర్తు చేస్తూ మరి ఏపీ ప్రజలకు వివరిస్తున్నారు జగన్‌.

59 నెలల పాలనలో అన్ని వర్గాలకు జరిగిన లబ్ధిని వివరిస్తూ ప్రచారం కొనసాగిస్తున్నారు జగన్‌. డీబీటీ ద్వారా బటన్‌నొక్కి నేరుగా 2 లక్షల 70వేల కోట్ల రూపాయలను ఎలాంటి సంక్షేమానికి ఖర్చు చేశారో చెబుతున్నారు. ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయించే ఈ ఎన్నికలు పేదల తలరాతను మారుస్తాయని, పేదల మీద తనకు ఉన్నంత ప్రేమ మరెవ్వరికీ ఉండదని చెబుతూ ప్రచారం సాగిస్తున్నారు. పేద లబ్ధిదారులే తనకు స్టార్ క్యాంపెయినర్లు అని ప్రకటించుకుని.. వాళ్ల ద్వారానే జరిగిన సంక్షేమాన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని చెప్పడమే కాకుండా..మేనిఫెస్టోలోని ఒక్కో హామీని వివరిస్తూ ప్రజల నుండే సమాధానం రాబడుతున్నారు. సంక్షేమం కొనసాగాలన్నా.. వలంటీర్లు పెన్షన్లు అందించాలన్నా.. ఫ్యాన్‌ గుర్తుకే ఓటేయాలని కోరుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..