Tribal University Inauguration: కేంద్ర గిరిజన యూనివర్సిటీకి శంకుస్థాపన చేసిన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, సీఎం జగన్..

అల్లూరు సీతారామారాజు నడిచిన ఈ పవిత్ర నేలపై గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయడం వలన గిరిజనుల భవిష్యత్‌ అద్భుతంగా మారుతుందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న కేంద్ర గిరిజన యూనివర్సిటీకి శుక్రవారం నాడు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఏపీ సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. అనంతరం దత్తిరాజేరు మండలం మరడాం గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేంద్రమంత్రి, సీఎం ఇద్దరూ ప్రసంగించారు. ముందుగా ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ..

Tribal University Inauguration: కేంద్ర గిరిజన యూనివర్సిటీకి శంకుస్థాపన చేసిన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, సీఎం జగన్..

Edited By: Ram Naramaneni

Updated on: Aug 25, 2023 | 1:54 PM

అల్లూరు సీతారామారాజు నడిచిన ఈ పవిత్ర నేలపై గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయడం వలన గిరిజనుల భవిష్యత్‌ అద్భుతంగా మారుతుందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న కేంద్ర గిరిజన యూనివర్సిటీకి శుక్రవారం నాడు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఏపీ సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. అనంతరం దత్తిరాజేరు మండలం మరడాం గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేంద్రమంత్రి, సీఎం ఇద్దరూ ప్రసంగించారు.

ముందుగా ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. ఏపీ అభివృద్ధి కోసం కేంద్రం ఎంతగానో సహకరిస్తుందన్నారు. ఎన్నో పథకాలు తీసుకువచ్చామన్నారు. రాష్ట్ర విభజన చట్టంలోని అన్ని హామీలను నెరవేరుస్తున్నామని చెప్పారు కేంద్ర మంత్రి. ఇక్కడ ఏర్పాటు చేస్తున్న గిరిజన యూనివర్సిటీతో వారి భవిష్యత్ బంగారుమయం అవుతుందన్నారు. అంతర్జాతీయ కోర్సులు ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తామని చెప్పారు కేంద్ర మంత్రి. కేంద్ర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు వేరైనా.. ప్రభుత్వ పరంగా తమకు అభివృద్ధే ముఖ్యం అని చెప్పుకొచ్చారు. రాష్ట్రాభివృద్ధి కోసం కలిసి పని చేస్తున్నామని పేర్కొన్నారు. నూతన విద్యా విధానం మన భారతీయులకు ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. ఈ సందర్భంగా బైలింగ్వల్ పాఠ్యపుస్తకాలు ప్రస్తావించారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. ప్రాంతీయ భాషలో విద్యనభ్యసిస్తే ఏ రంగంలోనైనా ఈజీగా అభివృద్ధి చెందవచ్చునని చెప్పారు.

ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ.. గిరిజనులు స్వచ్చమైన మనసు కలిగినవారు అని పేర్కొన్నారు. తరతరాలుగా గిరిజనులు అభివృద్ధికి దూరంగా ఉన్నారని, నాలుగేళ్లలో విద్య, వైద్య, వ్యవసాయం..రాజకీయంగా గిరిజనులకు అవకాశాలు కల్పించామని చెప్పారు. మూడు మెడికల్ కాలేజీలు కడుతున్నామన్న జగన్‌.. వీటి ద్వారా గిరిజనుల జీవన ప్రమాణాలు పెంచుతున్నాంటూ తెలిపారు. గిరిజనులకు ఎప్పటికీ రుణపడి ఉంటానని అన్నారు సీం జగన్. గిరి పుత్రుల జిల్లాలో వారి జీవితాల్లో ఉన్నత విద్యా కాంతులు నింపడానికి ఈ గిరిజన యూనివర్సిటీ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు సీఎం జగన్. విద్య చేరువైతే.. గిరిజనులు ప్రపంచంతో పోటీ పడే గొప్ప అడుగు పడుతుందని అన్నారు. తన నాలుగు సంవత్సరాల పరిపాలనలో విద్యా పరంగా, వైద్యం పరంగా, వ్యవసాయ పరంగా, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, జెండర్ పరంగా గిరిజనులను గుండెల్లో పెట్టుకుని అడుగులు వేశామని చెప్పారు సీఎం. ప్రపంచంలో వారిని నిలబెట్టే విద్యను వారికి అందించాలని ఆకాంక్షించారు సీఎం జగన్. గిరిజన యూనివర్సిటీ వల్ల గొప్పమార్పు జరగబోతోందని, రాబోయే రోజుల్లో తరతరాలు గుర్తుండిపోయేలా ఉండిపోతుందని పేర్కొన్నారు సీఎం.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..