CM Jagan: వాలంటీర్లకు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే రూ.25 వేలు నగదు బహుమతి ఖాయం..

ఏపీలో తీసుకొచ్చిన సచివాలయ సంస్థలో పనిచేసే వాలంటీర్లకు జగన్ సర్కార్ తీపి కబురు చెప్పింది. వాలంటీర్ల పనితనాన్ని గుర్తించి ప్రత్యేకమైన నగదు బహుమతిని అందించనుంది. దీనికి వాలంటీర్ల అభినందన కార్యక్రమం - 2024 అని నామకరణం చేశారు.

CM Jagan: వాలంటీర్లకు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే రూ.25 వేలు నగదు బహుమతి ఖాయం..
Cm Jagan Volunteer

Updated on: Jan 15, 2024 | 12:12 PM

ఏపీలో తీసుకొచ్చిన సచివాలయ సంస్థలో పనిచేసే వాలంటీర్లకు జగన్ సర్కార్ తీపి కబురు చెప్పింది. వాలంటీర్ల పనితనాన్ని గుర్తించి ప్రత్యేకమైన నగదు బహుమతిని అందించనుంది. దీనికి వాలంటీర్ల అభినందన కార్యక్రమం – 2024 అని నామకరణం చేశారు. గతంలో తమకు గౌరవ వేతనంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని వాలంటీర్లు పలు జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో వారి పనిని గుర్తించి ప్రత్యేకమైన కానుకను నగదు రూపంలో అందించేందుకు సిద్దమైంది ఏపీ ప్రభుత్వం. మండల, పట్టణ, జోనల్, నియోజకవర్గం, జిల్లా స్థాయిలో అద్భుతమైన సేవ కనబరిచిన వారికి ఈ నగదు నజరానా అందించనుంది. ఇలా తమ వృత్తిలో ప్రతిభ కనబరిచిన వారిని ఎంపిక చేసేందుకు జిల్లా స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేశారు. దీనిని జిల్లా కలెక్టర్ ఛైర్మెన్‌‎గా ఉంటారు.

వాలంటీర్ల వ్యవస్థలో బాగా పనిచేసి ప్రభుత్వం పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన వారిని గుర్తించనున్నారు కమిటీ సభ్యులు. ముఖ్యంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక, ఆసరా, చేయూత పథకాల అమలులో మంచి పనితీరు కనబరిచిన వారిని ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే ప్రతిఏటా ఉగాది రోజున సేవా వజ్ర, సేవారత్న, సేవా మిత్ర అవార్డులతో సన్మానం చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ తరహాలోనే వాలంటీర్ల అభినందన కార్యక్రమం ఏర్పాటు చేసి నగదు బహుమతి అందించాలని చూస్తోంది. ఫిబ్రవరి మూడవ వారంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు అధికారులు. మండల , పట్టణ, జోనల్ స్థాయిలో ఎంపికైన వాలంటీర్లకు రూ. 15 వేలు అందించగా.. నియోజకవర్గ స్థాయిలో పనిచేసే వారికి రూ. 20 వేలు నగదు బహుమతి ఇవ్వనున్నారు. ఇక జిల్లా స్థాయిలో మంచి పనితీరు కనబరిచిన వాలంటీర్లకు రూ. 25 వేలు నజరానా ఇవ్వనున్నట్లు మార్గదర్శకాలు జారీచేసింది ప్రభుత్వం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us