Andhra Pradesh: బెస్ట్ స్కూల్స్ గా ఏడు పాఠశాలలు ఎంపిక.. ఆగస్టు 15 న మెమొంటో అందించనున్న ముఖ్యమంత్రి
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వంద శాతం పాస్ పర్సంటేజ్ తో పాటు అధిక మార్కులు సాధించిన 7 ప్రభుత్వ పాఠశాలలను బెస్ట్ స్కూల్స్ గా ఎంపిక చేపింది. ఆగస్టు 15 స్వాంతంత్ర్య దినోత్సవం సందర్భంగా బెస్ట్ స్కూల్స్ గా....
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వంద శాతం పాస్ పర్సంటేజ్ తో పాటు అధిక మార్కులు సాధించిన 7 ప్రభుత్వ పాఠశాలలను బెస్ట్ స్కూల్స్ గా ఎంపిక చేపింది. ఆగస్టు 15 స్వాంతంత్ర్య దినోత్సవం సందర్భంగా బెస్ట్ స్కూల్స్ గా ఎంపికైన పాఠశాలలకు సీఎం జగన్ (CM Jagan) మెమొంటోలను అందజేయనున్నారు. శ్రీకాకుళం జిల్లా కింతలి జెడ్పీ హైస్కూలు, విజయనగరం జిల్లా పెరుమాలి ఏపీ మోడల్ స్కూలు, విజయనగరం జిల్లా భద్రగిరి గిరిజన సంక్షేమ బాలికల రెసిడెన్సియల్ స్కూలు, విజయనగరం జిల్లా తాటిపూడి ఏపీ బాలికల రెసిడెన్సియల్ హై స్కూలు, ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు జెడ్పీ ఉన్నత పాఠశాల, ప్రకాశం జిల్లా రాయవరం బాలికల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ స్కూలు, కర్నూలు డాక్టర్ ఏపీజే అబ్దుల్‌కలామ్ మెమోరియల్ మునిసిపల్ కార్పొరేషన్ హైస్కూలు, శ్రీకాకుళం జిల్లా వంగర కేజీబీ విద్యాలయం బెస్ట్ స్కూళ్లుగా ఎంపికయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వ అధికారులు వివరాలు వెల్లడించారు.
కాగా.. ఈ ఏడాది జూన్ లో ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 6,15,908 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా వారిలో 4,14,281 మంది పాసయ్యారు. ఫలితాల్లో ప్రకాశం జిల్లా ప్రథమ స్థానంలో అనంతపురం జిల్లా చివరి స్థానంలో నిలిచాయి. ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకు ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు జరిగాయి. మొత్తం 67.26 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రెండేళ్ల తర్వాత మొదటిసారిగా పదో తరగతి పరీక్షలు నిర్వహించి, మార్కుల వారీగా ఫలితాలు వెల్లడించారు.
మరోవైపు.. ఏపీ టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఇటీవలే విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో ఫలితాలు విడుదల చేశారు. జులై 6 నుంచి 15వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించగా.. 1,91,600 మంది హాజరయ్యారు. ఫలితాల్లో బాలురు 60.83 శాతం, బాలికలు 68.76 శాతం పాస్ అయ్యారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయాలి..