YSR Kapu Nestham Scheme: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాసేపట్లో తూర్పుగోదావరి జిల్లాకు చేరుకోనున్నారు. నిడదవోలులో వైఎస్సార్ కాపు నేస్తం నిధులు విడుదల చేయనున్నారు. ఈ ఉదయం పది గంటలకు నిడదవోలు చేరుకుని.. రోడ్ షో ద్వారా సభాస్థలికి వెళ్లనున్నారు. సభలో బటన్ నొక్కడం ద్వారా వైఎస్ జగన్ వైయస్సార్ కాపు నేస్తం నిధులు 3 లక్షలా 57 వేల మందికి పైగా మొత్తం 537 కోట్ల రూపాయల నిధులను అందించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటి గంటకు తాడేపల్లికి బయల్దేరుతారు.. సీఎం పర్యటన నేపథ్యంలో నిడదవోలులో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సభాస్థలి దగ్గర భారీగా పోలీసులను మోహరించారు.
వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా 45 నుంచి 60 ఏళ్లలోపు ఉన్నవారికి ప్రభుత్వం 15 వేల రూపాయల ఆర్థిక సాయం చేస్తోంది. ఏటా 15 వేల చొప్పున ఐదేళ్లలో 75 వేల ఆర్థిక సాయం అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.. ఇందులో ఇప్పుడు నాలుగో విడత అందిస్తున్నారు.. ఇవాళ అందజేసే సాయంతో కలిపితే ఇప్పటివరకు ఈ పథకం ద్వారా మొత్తం రూ.2,029 కోట్లు ఆర్థిక సాయాన్ని అందించినట్లవుతుందని జగన్ ప్రభుత్వం వెల్లడించింది. వైసీపీ ప్రభుత్వం 52 నెలల్లో 77 లక్షల మంది లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..