CM Jagan: శాంతి భద్రతల పరిస్థితిపై సీఎం జగన్‌ ఉన్నతస్థాయి సమీక్ష.. బుధవారం ఢిల్లీ వెళ్లే ఛాన్స్..

లండన్ టూర్ ముగించుకుని ఏపీకి వచ్చేశారు సీఎం జగన్. కానీ.. తాను లండన్‌ వెళ్లే సమయానికి, తిరిగొచ్చే సమయానికి ఏపీ పరిస్థితుల్లో చాలాచాలా తేడా ఉంది. చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ నేపథ్యంలో రాష్ట్రం మొత్తం వేడివేడిగా మారింది. అటు... ప్రతిపక్షాలు ఆందోళన బాట వీడ్డం లేదు. ఇదే సమయంలో పాలనాపరంగా, రాజకీయ పగంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు జగన్.

CM Jagan: శాంతి భద్రతల పరిస్థితిపై సీఎం జగన్‌ ఉన్నతస్థాయి సమీక్ష.. బుధవారం ఢిల్లీ వెళ్లే ఛాన్స్..
Andhra CM Jagan Reddy

Updated on: Sep 12, 2023 | 10:18 PM

లండన్‌ పర్యటన ముగించుకొని సీఎం జగన్‌ వచ్చిన వెంటనే ఏపీలో రాజకీయ హడావుడి మరింత పెరిగింది. చంద్రబాబు రిమాండ్‌, కోర్టులో పిటిషన్ల వ్యవహారాన్ని అదనపు అడ్వకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి సీఎంకు వివరించారు. శాంతి భద్రతల పరిస్థితిపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ వెంటనే పార్టీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సీఎంను కలిసి రాష్ట్రంలో తాజా పరిస్థితిని వివరించారు. ఆ వెంటనే శాంతి భద్రతల పరిస్థితిపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు సీఎం జగన్‌. డీజీపీ, ఇంటెలిజెన్స్ అదనపు డీజీ, హోం మంత్రి, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

మరో వైపు ఈ నెల 21 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సమావేశాల నిర్వహణపై చర్చించేందుకు సీఎం జగన్‌ను చీఫ్‌ విప్‌ ప్రసాదరాజు కలిశారు. వారం పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. తమ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలతో పాటు గత ప్రభుత్వ అవినీతిపై సమావేశాల్లో మాట్లాడాలని సీఎం నిర్ణయించినట్టు తెలుస్తోంది. అంతే కాదు ఈ సమావేశాల్లో రోజుకో కీలక విషయంపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నారు.

అటు ముందస్తు ఎన్నికలపై వైసీపీలో చర్చ జోరందుకుంది. ఉదయం నుంచి సీఎం నిర్వహించిన వరుస సమావేశాల్లో ఈ అంశం ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. ప్రధాని మోదీతో సీఎం జగన్‌ సమావేశం తర్వాత ముందస్తు ఎన్నికలపై క్లారిటీ వస్తుందనే మాటలు వైసీపీ నేతల నుంచి వినపడుతున్నాయి. ఈ క్రమంలో సీఎం జగన్‌ రేపు ఢిల్లీ వెళ్లనున్నారని సమాచారం. ఈ పర్యటనలో ఆయన చంద్రబాబు అరెస్టు, రాష్ట్రంలో తాజా పరిణామాలను ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్తారని తెలుస్తోంది.

శాంతి భద్రతలపై సమీక్ష..

ఈ తెల్లవారుజామున లండన్‌ నుంచి వచ్చిన సీఎం జగన్‌ వెంటనే రాష్ట్ర తాజా పరిస్థితులు, పరిణామాలపై దృష్టి సారించారు. చంద్రబాబు కేసు, రిమాండ్‌, శాంతి భద్రతలపై సమీక్ష చేపట్టారు. పార్టీ ముఖ్యనేతలందరూ సీఎంతో ఇప్పటేకే భేటీ అయ్యారు. శాంతి భద్రతల పరిస్థితి వివరించేందుకు డీజీపీ కూడా సీఎం క్యాంప్‌ ఆఫీసుకు రానున్నారు.

ఢిల్లీ పర్యటనకు సీఎం జగన్

బుధవారం, గురువారం సీఎం జగన్‌ ఢిల్లీలో పర్యటించనున్నారు. రెండు రోజుల ఢిల్లీ టూర్ తర్వాత ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు సీఎం జగన్.

టీడీపీ ఆందోళనలు..

చంద్రబాబు అరెస్టుపై విపక్షాలు మండిపడుతున్నాయి.. 4 రోజులుగా ఆందోళనలు కూడా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితులపై సీఁఎం జగన్‌ సమీక్ష చేయనున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే జగన్‌ ఢిల్లీ కూడా వెళ్తుండడం ఆసక్తికరంగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం