CM Jagan-Konaseema: నేడు కోనసీమ జిలాల్లో సీఎం జగన్ పర్యటన.. వరదబాధితులతో నేరుగా మాట్లాడనున్న ముఖ్యమంత్రి
కోనసీమ జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటించనున్నారు. వరద ముంపు గ్రామాలను పరిశీలించనున్నారు. బాధితులతో సీఎం వైఎస్ జగన్ నేరుగా మాట్లాడనున్నారు. ఉదయం 10.30 గంటలకు పి.గన్నవరం మండలం జి.పెదపూడి గ్రామానికి ముఖ్యమంత్రి చేరుకోనున్నారు. 11 గంటలకు పుచ్చకాయల వారి
CM Jagan – Konaseema: నేడు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. గోదావరి నది (Godavari River) పరివాహక ప్రాంతాల్లోని లంక గ్రామాల్లో వరద బీభత్సం సృష్టించింది. జిలాల్లోని పలు లంకల గ్రామాలు వరద ముంపుకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో వరద ముంపు ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటించనున్నారు. వరద ముంపు గ్రామాలను పరిశీలించనున్నారు. బాధితులతో సీఎం వైఎస్ జగన్ నేరుగా మాట్లాడనున్నారు. ఉదయం 10.30 గంటలకు పి.గన్నవరం మండలం జి.పెదపూడి గ్రామానికి ముఖ్యమంత్రి చేరుకోనున్నారు. 11 గంటలకు పుచ్చకాయల వారిపేటలో వరద బాధితులతో సమావేశం కానున్నారు. అనంతరం అరిగెలవారిపేట చేరుకుని అక్కడ బాధితులను కలుసుకుని.. మాట్లాడనున్నారు. అనంతరం ఊడిమూడిలంక చేరుకుని అక్కడ వరద బాధితులతో సమావేశం కానున్నారు.
మధ్యాహ్నం 2.05 గంటలకు ఊడిమూడిలంక నుంచి పి.గన్నవరం మండలం వాడ్రేవుపల్లి చేరుకొని బాధితులను పరామర్శించనున్నారు. అనంతరం రాజోలునియోజకవర్గంలోని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. మేకలపాలెంలో వరద బాధితులతో సమావేశం కానున్నారు. అనంతరం సాయంత్రం 4.05 గంటలకు రాజమండ్రి చేరుకుంటారు. ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్‌లో సీఎం జగన్.. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో వరద ప్రభావం అనంతరం తీసుకున్న సహాయక చర్యలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. రాత్రికి రాజమండ్రిలోనే సీఎం జగన్ బస చేయనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. పర్యటనకు తగిన ఏర్పాట్లు చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..