Andhra Pradesh: బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు జగన్ సర్కార్ బంపర్ న్యూస్.. అక్టోబర్ 1న…

మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌లా అత్యంత పవిత్రంగా భావిస్తామని తన ప్రమాణ స్వీకారం రోజున చెప్పిన జగన్.. ఆ దిశగా ముందుకు సాగుతున్నారు. తాజాగా మరో పథకానికి శ్రీకారం చుట్టారు.

Andhra Pradesh: బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు జగన్ సర్కార్ బంపర్ న్యూస్.. అక్టోబర్ 1న...
Cm Jagan
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 10, 2022 | 8:27 PM

CM Jagan: అక్టోబరు 1 నుంచి వైఎస్సార్‌ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకం అమలు చేయనుంది జగన్ సర్కార్.  దీంతో ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో 98.44 శాతం అమలు చేయబోతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇందుకు సంబంధించి జీవో జారీ చేసింది.  బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు, భవన కార్మికుల కుటుంబాలకు ఈ పథకం వర్తింపు చేస్తున్నట్లు తెలిపింది. పేద ఆడపిల్లల కుటుంబాలకు సర్కారు బాసటగా నిలిచేందుకు.. వారికి అండగా ఉండేందుకు ఈ పథకం అమలు చేస్తున్నట్లు పేర్కొంది. కళ్యాణమస్తు, షాదీ తోఫాల కింద గత ప్రభుత్వం ప్రకటించిన దానికంటే అధికంగా నగదు సాయం చేయనుంది జగన్ సర్కార్.  ఎస్సీలకు వైఎస్సార్‌ కళ్యాణమస్తు కింద లక్ష రూపాయలు అందజేయనుంది. ఎస్సీల కులాంత వివాహాలకు రూ. 1.2 లక్షలు ఇవ్వనుంది. ఎస్టీలకు రూ. 1 లక్ష సాయం చేయనుంది. ఎస్టీల కులాంతర వివాహాలకు రూ.1.2 లక్షలు ఇవ్వనుంది. బీసీలకు రూ. 50వేలు.. వారు కులాంతర వివాహాలు చేసుకుంటే రూ.75వేలు సాయం చేయనుంది. మైనార్టీలకు రూ. 1 లక్ష సాయం అందించనుంది. వికలాంగుల వివాహాలకు రూ. 1.5 లక్షలు సాయం చేయబోతున్నట్లు తెలిపింది. భవన నిర్మాణ కార్మికులకు రూ.40వేలు ఇవ్వనన్నట్లు తెలిపింది. అమ్మాయి వయస్సు 18 సంవత్సరాలు, అబ్బాయి వయస్సు 21 సంవత్సరాలు దాటాలనే నిబంధనను జీవోలో పొందుపరిచింది ప్రభుత్వం. పథకానికి సంబంధించి పూర్తి వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంటాయని తెలిపింది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పథకం నిర్వహణ ఉంటుందని స్పష్టం చేసింది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే