Pulasa Fish: రెండున్నర కేజీల పులస.. ఎంత ధర పలికిందో తెల్సా..? ఏంది సామి ఈ రేటు..?
పుస్తెలమ్మయినా సరే పులస తినాలి అనే సామెత అందరికీ తెలిసే ఉంటుంది. సీజనల్‌గా మాత్రమే దొరికే ఈ చేపకు ఉండే క్రేజ్ నెక్ట్స్ లెవల్.
Andhra Famous Fish: పులస కూరతో అన్నం తింటే ప్లేట్ కూడా నాకేస్తారండి అంటున్నారు గోదావరి వాసులు. ఆ చేపకు ఉండే టేస్ట్ అలాంటిది మరి. సీజనల్‌గా దొరికే ఈ పిష్‌కు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అయితే ఈ ఏడాది జాలర్లకు ఎక్కువగా పులసలు చిక్కడం లేదు. దీంతో రేటు ఇంకొంచం ఎక్కువగా పెరిగింది. తాజాగా రాజమహేంద్రవరం జిల్లా ధవళేశ్వరం బ్యారేజ్‌లో రెండున్నర కేజీలు ఉన్న పులస జాలరికి చిక్కింది. దాన్ని 25 వేలకు చేజిక్కించుకున్నాడు ఓ వ్యక్తి. దీన్ని బట్టి పులస 100 గ్రాములు 1000 రూపాయలు అని అర్థం చేసుకోవచ్చు. ఉభయ గోదావరి జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో మాత్రమే పులసలు దొరుకుతాయి. జూన్, జూలై, ఆగష్టు నెలల్లో మాత్రమే ఇవి దొరుకుతాయి. సెప్టెంబర్ నెలలో కూడా అరుదుగా లభిస్తాయి. సముద్రం నుంచి రివర్స్‌గా గోదావరిలోకి ఎంత దూరం ఎదురీదితే.. అత రుచిగా తయారవుతాయి ఈ పులసలు. ఎదురీదక ముందు వీటిని ఇలసలు అంటారు. అయితే ఇలసలు.. పులసలు ఒకే మాదిరిగా ఉంటాయి. తెలియనివాళ్లను ఈజీగా మోసం చేసేస్తారు. పులసను అమ్మేందుకు వేలంపాట కూడా నిర్వాహిస్తారంటే దాని డిమాండ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. బెండకాయతో కలిపి పులుసు పెట్టి వండింతే.. ఆహా ఆ రుచిని అస్సలు వర్ణించలేం. వండిన రోజు కాకుండా తెల్లారి ఆ పులుసుతో అన్నం తింటే.. డబుల్ టేస్ట్ ఉంటుంది. మీకు కాని అని అందుబాటులో ఉంటే అరుదైన ఈ పులసను టేస్ట్ చేయకుండా ఉండకండి.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి