Peddireddy : అక్కచెల్లెమ్మల ఆర్థికాభివృద్ధికి సీఎం జగన్ ఎంతో తోడ్పాటును అందిస్తున్నారు : మంత్రి పెద్దిరెడ్డి

ఏయే పథకం.. ఏయే నెలలో అమలు చేస్తామో ముందుగానే క్యాలెండర్‌ విడుదల చేసి మరీ ప్రజల ఖాతాల్లో నగదు జమచేస్తోన్న దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి వైయస్..

Peddireddy :  అక్కచెల్లెమ్మల ఆర్థికాభివృద్ధికి సీఎం జగన్ ఎంతో తోడ్పాటును అందిస్తున్నారు : మంత్రి పెద్దిరెడ్డి
Peddireddy Ramachandra Reddy

Updated on: Jun 22, 2021 | 5:30 PM

AP Minister Peddi Reddy : ఏయే పథకం.. ఏయే నెలలో అమలు చేస్తామో ముందుగానే క్యాలెండర్‌ విడుదల చేసి మరీ ప్రజల ఖాతాల్లో నగదు జమచేస్తోన్న దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. పేద ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకోవాలనే లక్ష్యంతో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన చేస్తున్నారని ఆయన చెప్పారు. 3648 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రజల నుంచి తన దృష్టికి వచ్చిన సమస్యలను నవరత్నాలు, 2 పేజీల మేనిఫెస్టోలో పొందుపరిచి దాదాపుగా అన్నీ అమలు చేస్తున్నారన్నారు. వైయస్‌ఆర్‌ చేయూత పథకం అమలులో భాగంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాడేపల్లిలో మాట్లాడారు.

ఈ రోజు వైయస్‌ఆర్‌ చేయూత రెండో విడత కార్యక్రమాన్ని మొదలుపెడుతున్నామని తెలిపిన పెద్దిరెడ్డి… గతంలో మొదటి విడతలో 24 లక్షల మందికి రూ.18,750 చొప్పున దాదాపు రూ.4,500 కోట్లు ఇవ్వడం జరిగిందని చెప్పారు. రూ.18,750 చొప్పున నాలుగు దఫాలుగా రూ.75 వేలు ప్రతి మహిళలకు ఇచ్చే పరిస్థితి జగన్ కల్పించారని ఆయన వెల్లడించారు. అదే విధంగా రెండో విడతలో 23,44,572 మందికి దాదాపు రూ.4,340 కోట్లు విడుదల చేయనున్నామని, ఈ విధంగా నాలుగు సంవత్సరాల్లో దాదాపు రూ.19 వేల కోట్లు కేటాయించడమే కాకుండా.. అక్కచెల్లెమ్మల ఆర్థికాభివృద్ధికి సీఎం జగన్ తోడ్పాటును అందిస్తున్నారని పెద్దిరెడ్డి వెల్లడించారు.

అమూల్, హిందుస్తాన్‌ యూనిలివర్, రిలియన్స్, ఐటీసీ ఇవే కాకుండా ఇంకా 14 సంస్థలు వైయస్‌ఆర్‌ చేయూత పథకంలో భాగస్వాములు అవుతామని ముందుకువచ్చాయని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. వీటికి సంబంధించి సలహాలు, సాంకేతిక సమస్యలు పరిష్కరించడం కోసం కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశామని మంత్రి స్పష్టం చేశారు.

Read also : Somu Veerraju : సొంత ఆస్తులను సీఎం జగన్ ఎందుకు తాకట్టు పెట్టడంలేదు..? ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు