Andhra Pradesh: గోదావరి విశ్వరూపం.. వరద ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే

|

Jul 15, 2022 | 5:52 PM

ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో గోదావరి (Godavari) మహోగ్ర రూపం దాల్చుతోంది. హద్దులు, గట్లు దాటుకుంటూ గ్రామాలు, ఊర్లు, పట్టణాలను ముంచెత్తుతోంది. ఉత్తర తెలంగాణ నుంచి సాగరసంగమం వరకు గోదావరి పరివాహకప్రాంతాలు నీటమునిగాయి....

Andhra Pradesh: గోదావరి విశ్వరూపం.. వరద ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే
CM Jagan Aerial survey
Follow us on

ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో గోదావరి (Godavari) మహోగ్ర రూపం దాల్చుతోంది. హద్దులు, గట్లు దాటుకుంటూ గ్రామాలు, ఊర్లు, పట్టణాలను ముంచెత్తుతోంది. ఉత్తర తెలంగాణ నుంచి సాగరసంగమం వరకు గోదావరి పరివాహకప్రాంతాలు నీటమునిగాయి. పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఈ పరిస్థితుల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ (CM Jagan).. ఏరియల్‌ సర్వే నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు, ధవళేశ్వర్యం బ్యారేజీ, లంక గ్రామాల్లోని పరిస్థితులను పరిశీలించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ముంపు ప్రభావిత గ్రామాలను ఖాళీ చేయించాలని సూచించారు. కాగా.. గోదావరిలో వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద నీటిమట్టం 70.10 అడుగులకు చేరింది. ఆ వరద ధవళేశ్వరం బ్యారేజీకి చేరుకునేందుకు మరో 21 గంటల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం గంటగంటకూ పెరుగుతోంది. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వరదతో సమీపంలోని ప్రాంతాలు జలమయమయ్యాయి. గోదావరి నది ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తోంది. అక్కడ ప్రస్తుతం నీటిమట్టం సుమారు 18 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం 19లక్షల క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేస్తున్నారు.

మరోవైపు.. భద్రాచలం వద్ద పరిస్థితిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. వరద సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో గోదావరి (Godavari) ఉగ్రరూపం దాల్చుతోంది. భద్రాచలం వద్ద ప్రమాదకరస్థాయిని మించి ప్రవహిస్తోంది. పట్టణంలోని పలు కాలనీలు నీట మునిగాయి. వరద ప్రవాహం ఇంకా పెరగవచ్చన్న అధికారుల హెచ్చరికలు స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రామయ్య ఆలయాన్ని వరద నీరు తాకింది. పట్టణంలోని కొత్త కాలనీ, ఏఎంసీ కాలనీ, అయ్యప్ప కాలనీ, శాంతినగర్‌ పిస్తా కాంప్లెంక్స్‌ ఏరియా, సుభాష్‌ నగర్‌ తదితర ప్రాంతాలు నీట మునిగాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..