CM Chandrababu: అన్నీ అబ్జర్వ్‌ చేస్తున్నా.. నోరు అదుపులో పెట్టుకోండి: ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు వార్నింగ్

|

Feb 28, 2025 | 7:35 PM

చూస్తున్నా... అన్నీ అబ్జర్వ్‌ చేస్తున్నా.. నోరు అదుపులో పెట్టుకోని మాట్లాడండి.. అనవసర విషయాలు వద్దు.. అంటూ చంద్రబాబు ఎమ్మెల్యేలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.. టీడీఎల్పీ మీటింగ్‌లో మాట్లాడిన సీఎం చంద్రబాబు నాయుడు.. ఇక నుంచి జాగ్రత్త అంటూ నేతలకు చిన్న క్లాస్‌ ఇచ్చారు.. ఎమ్మెల్యేలంతా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలంటూ చంద్రాబు సూచించారు..

CM Chandrababu: అన్నీ అబ్జర్వ్‌ చేస్తున్నా.. నోరు అదుపులో పెట్టుకోండి: ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు వార్నింగ్
CM Chandrababu
Follow us on

చూస్తున్నా… అన్నీ అబ్జర్వ్‌ చేస్తున్నా.. నోరు అదుపులో పెట్టుకోని మాట్లాడండి.. అనవసర విషయాలు వద్దు.. అంటూ చంద్రబాబు ఎమ్మెల్యేలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.. టీడీఎల్పీ మీటింగ్‌లో మాట్లాడిన సీఎం చంద్రబాబు నాయుడు.. ఇక నుంచి జాగ్రత్త అంటూ నేతలకు చిన్న క్లాస్‌ ఇచ్చారు.. ఎమ్మెల్యేలంతా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలంటూ చంద్రాబు సూచించారు.. అనవసర విషయాల జోలికి వెళ్లొద్దన్నారు. గ్రూపు రాజకీయాలొద్దు.. పార్టీని ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దు అంటూ పేర్కొన్నారు. పార్టీ పటిష్టం కోసం ప్రతిఒక్కరూ పనిచేయాలన్నారు. అలాగే కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు సభకు వచ్చామా వెళ్లామా అన్నట్లు కాకుండా అవగాహన పెంచుకోవాలని సూచించారు..

వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కాలంటే ఇప్పటి నుంచే పనితీరులో మార్పు రావాలని.. సీఎం చంద్రబాబు సూచించారు. మళ్లీ సభకు రావాలని అనే భావనతో ఎమ్మెల్యేల పనితీరు ఉండాలని.. కొత్త ఎమ్మెల్యేలకు పలు సూచనలు చేశారు. అలాగే, ఎమ్మెల్యేలు, ఎంపీలకు సమన్వయం ఉండాలన్న చంద్రబాబు… గ్రూపు విభేదాలను ఏ ఒక్కరూ సహించవద్దన్నారు. ప్రతి ఒక్కరు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి.. పేదవారికి ప్రభుత్వం చేస్తున్న మంచిని తెలియజేయాలని సూచించారు.

టీడీఎల్పీ మీటింగ్‌లో నామినేటెడ్‌ పోస్టులపై కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. వచ్చే నెలాఖరులోగా నామినేటెడ్‌ పదవులు భర్తీ చేస్తామన్నారు. సాధికార కమిటీ సభ్యులకే నామినేటెడ్ పదవులన్న ఆయన… మార్కెట్ యార్డులు, దేవస్థానాలకు పేర్లు ఇవ్వాలన్నారు. మహానాడులోపు పార్టీ పదవులు భర్తీ జరగాలని చంద్రబాబు చెప్పారు.

ఆర్ధిక కష్టాల్లో ఉన్నప్పటికీ మంచి బడ్జెట్‌ అందించామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. వైసీపీ హయాంలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందన్నారు. బడ్జెట్‌లో సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చామన్న ఆయన… బడ్జెట్‌ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నేతలకు సూచించారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..