Vijayawada TDP: ఆ ఒక్క నిర్ణయంతో విజయవాడ టీడీపీలో భగ్గుమన్న విభేదాలు.. ఇంతకీ ఆ నిర్ణయం ఏంటంటే..!

|

Dec 23, 2021 | 9:02 AM

Vijayawada TDP: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు కేరాఫ్‌ అడ్రస్‌ బెజవాడ. అలాంటి చోట అంతర్గత గొడవలతో ఇబ్బంది పడుతోంది టీడీపీ. తాజాగా మరోసారి నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి.

Vijayawada TDP: ఆ ఒక్క నిర్ణయంతో విజయవాడ టీడీపీలో భగ్గుమన్న విభేదాలు.. ఇంతకీ ఆ నిర్ణయం ఏంటంటే..!
Tdp
Follow us on

Vijayawada TDP: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు కేరాఫ్‌ అడ్రస్‌ బెజవాడ. అలాంటి చోట అంతర్గత గొడవలతో ఇబ్బంది పడుతోంది టీడీపీ. తాజాగా మరోసారి నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ‘‘పార్టీలో అంతర్గత వివాదాలతో నష్టపోతున్నాం. నేతలు తీరు మార్చుకోవాలి. లేకుంటే ఇంకా నష్టం తప్పదు.’’ విజయవాడ మున్సిపల్‌ కార్పోరేషన్‌ ఎన్నికల తర్వాత చంద్రబాబు చెప్పిన మాటలు ఇవి. చంద్రబాబు వార్నింగ్ తరువాత కాంట్రవర్సల్‌ కామెంట్స్‌ కొంచెం తగ్గాయి. కానీ తాజాగా మళ్లీ కేశినేని వర్సెస్ బుద్ధా మధ్య విభేధాలు భగ్గుమన్నాయి. దానికి కారణం పశ్చిమ నియోజకవర్గం కో-ఆర్డినేటర్‌గా ఎంపీ కేశినేని నియామకమే. వాస్తవానికి పశ్చిమ ఇన్‌ఛార్జ్‌ పదవిని ఆశించిచారు బుద్ధా వెంకన్న, నాగుల్‌మీరా. అయితే ఆ ఇద్దరికి ఇప్పటికే వేర్వేరు బాధ్యతలు ఉన్న కారణంగా కోఆర్డినేటర్‌గా కేశినేనిని నియమించారు చంద్రబాబు. అంతే కాదు డివిజన్‌ స్థాయి కమిటీలపైనా కేశినేనికి ఫ్రీ హ్యాండ్‌ ఇచ్చారు సైకిల్‌ బాస్. బుద్ధా, నాగుల్‌ మీరా కమిటీలను పక్కన పెట్టుకోవచ్చని నానికి వదిలేశారు.

ఇప్పుడిదే వివాదానికి కారణమైంది. విజయవాడ పశ్చిమ బాధ్యతలు కేశినేనికి అప్పగించడంపై బుద్ధావెంకన్నా, నాగుల్‌ మీరా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కేడర్‌తో భేటీ అయ్యారు బుద్ధా వెంకన్న. ఆ వెంటనే బుద్ధావెంకన్న, నాగుల్‌మీరా అనుచరులు ఆందోళనకు దిగారు. నాని నాయకత్వంలో పనిచేయబోమంటూ నినాదాలు చేశారు కార్యకర్తలు. పశ్చిమ నియోజకవర్గానికి చెందిన వ్యక్తికే ఇంఛార్జ్‌ పదవి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు కేడర్. దీంతో అలర్ట్ అయిన టీడీపీ హైకమాండ్ నష్టనివారణ చర్యలు చేపట్టింది. బుద్దా వెంకన్నను కూల్ చేసే ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగా ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించింది. ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ కార్యకలాపాలు, వ్యవహారాలు పర్యవేక్షించే బాధ్యతలు అప్పగించారు చంద్రబాబు. మరి దీనిపై బుద్దా వెంకన్న ఎలా స్పందిస్తారన్నది ఇప్పటికైతే సస్పెన్సే.

ఇకపోతే గత కొంత కాలంగా విజయవాడ టీడీపీలో వర్గపోరు నడుస్తోంది. ముఖ్యంగా కార్పొరేషన్‌ ఎన్నికల సమయంలో కేశినేని నానితో బుద్దావెంకన్న, నాగుల్‌మీరా తీవ్రంగా విభేదించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత పార్టీకి దూరంగా ఉన్నారు కేశినేని నాని. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారాయన. సీన్ కట్ చేస్తే మంగళగిరిలో చంద్రబాబు చేపట్టిన దీక్షలో ప్రత్యక్షమయ్యారు నాని.

Also read:

TTD Tickets: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. సర్వదర్శనం టికెట్లు రేపు విడుదల.. వివరాలివే

Andhra Pradesh: ఏపీని వణికిస్తున్న శీతల గాలులు.. వృద్దులు, చిన్నారులు జాగ్రత్త అంటున్న నిపుణులు..

Pro Kabaddi League 2021: నేడు బరిలోకి దిగనున్న ఆరు టీంలు.. హోరాహోరీ పోరులో గెలుపెవరిదో?