Andhra Pradesh: తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు నగర పంచాయతీ(మునిసిపాలిటి)లో హైడ్రామా నెలకొంది. ఒక నగర పంచాయతీ కోసం ఇద్దరు మున్సిపల్ కమిషనర్ల మధ్య వివాదం చోటు చేసుకుంది. అసలు మ్యాటర్ ఏంటంటే.. అధికారి లక్ష్మిపతి రాజును గొల్లప్రోలు మున్సిపల్ కమిషనర్‌గా నియమిస్తూ డీఎంఏ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల మేరకు జాయిన్ అయ్యేందుకు గొల్లప్రోలు నగర పంచాయతీ కార్యాలయానికి వచ్చారు లక్ష్మీపతి రాజు. అయితే, పాత కమిషనర్ సాయిబాబు.. ఆ ఉత్తర్వులను ఏమాత్రం లక్ష్య పెట్టలేదు. కొత్త కమిషనర్ లక్ష్మీపతి రాజుకు బాధ్యతలు అప్పగించకుండా హంగామా చేశాడు. కొత్త కమిషనర్ ఉండగానే సమాధానం చెప్పకుండా కార్యాలయానికి తాళాలు వేసుకుని వెళ్లిపోయాడు పాత కమిషర్ సాయిబాబు. దాంతో బాధ్యతలు స్వీకరించేందుకు రోజంతా నగర పంచాయతీ కార్యాలయంలోనే నిరీక్షించారు లక్ష్మీపతి రాజు. చివరికి చేసేదేమీ లేక వెనుదిరిగారు. మరోవైపు ఈ కుర్చీ ఆటతో కార్యాలయ సిబ్బంది అయోమయంలో పడింది. సాయిబాబు మాట వినాలో, కొత్త కమిషనర్ లక్ష్మీపతి రాజు మాట వినాలో అర్థం కాక సతమతం అయ్యారు.
కాగా, రాజకీయ పలుకుపడితో గొల్లప్రోలు నగర పంచాయతీలోనే సాయిబాబు తిష్ట వేసుకుని కూర్చున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నారు. మరోవైపు తాను విధులకు హాజరైనట్లు డీఎంఏ కార్యాలయానికి కొత్త కమిషనర్ లక్ష్మీపతి రాజు సమాచారం అందించారు. అయితే, లక్ష్మీపతి రాజును గొల్లప్రోలు కమిషనర్‌గా నియమిస్తూ సెప్టెంబర్ 23వ తేదీనే ప్రభుత్వం జీవో జారీ చేసింది. రామచంద్రపురం మేనేజర్‌గా వెళ్లిపోవాలని పాత కమిషనర్ సాయిబాబుకి అదే ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అయినా కమిషనర్‌ను తానేనని తిష్ట వేశాడు పాత కమిషనర్ సాయిబాబు. ఇక గొల్లప్రోలు కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టేందుకు సెప్టెంబర్ 23 నుంచి ఇప్పటి వరకు మూడు సార్లు ప్రయత్నించారు లక్ష్మీపతి రాజు. అయినప్పటికీ ప్రతిసారి ఆయనకు చేదు అనుభవమే ఎదురవుతుంది. కాగా, ఈ ఉదంతం స్థానిక ఎమ్మెల్యే పెండెం దొరబాబుకి తెలియటంతో.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. మరి ఈ సీటును సాయిబాబు వదులుతాడా? లేక ప్రభుత్వ వర్గాలు చెబుతున్నట్లుగా తన పలుకుబడితో వ్యవహారాన్ని కొనసాగిస్తాడా? అనేది చూడాలి.
Also read:
Farmers Protest: పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ట్రాక్టర్ ర్యాలీలో అరెస్టయిన రైతులకు పరిహారం..
Balakrishna NBK 107: ఘనంగా ప్రారంభమైన బాలకృష్ణ NBK107.. డైరెక్టర్ ఎవరంటే.