Andhra Pradesh: తూర్పుగోదావరిలో టీడీపీ వర్సెస్‌ టీడీపీ ఫైట్‌.. కొవ్వూరు వేదికగా బయటపడ్డ వర్గ విభేదాలు..

|

Nov 27, 2022 | 10:32 AM

తూర్పుగోదావరిలో టీడీపీ వర్సెస్‌ టీడీపీ ఫైట్‌ జరుగుతోంది. కలిసి పనిచేయాల్సిన నేతలు రెండు వర్గాలుగా విడిపోయి కొట్టేసుకుంటున్నారు. కొవ్వూరు వేదికగా మరోసారి బయటపడ్డాయి..

Andhra Pradesh: తూర్పుగోదావరిలో టీడీపీ వర్సెస్‌ టీడీపీ ఫైట్‌.. కొవ్వూరు వేదికగా బయటపడ్డ వర్గ విభేదాలు..
Tdp Tuni
Follow us on

తూర్పుగోదావరిలో టీడీపీ వర్సెస్‌ టీడీపీ ఫైట్‌ జరుగుతోంది. కలిసి పనిచేయాల్సిన నేతలు రెండు వర్గాలుగా విడిపోయి కొట్టేసుకుంటున్నారు. కొవ్వూరు వేదికగా మరోసారి బయటపడ్డాయి వర్గ విభేదాలు. అవును, కొవ్వూరు టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయ్‌. మాజీ మంత్రి జవహర్‌ అనుకూల, వ్యతిరేక వర్గాలు మళ్లీ స్ట్రీట్‌ ఫైట్‌ దిగాయ్‌. తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చియ్యచౌదరి ముందే చితక్కొట్టుకున్నారు తెలుగు తమ్ముళ్లు. ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో కీలక మీటింగ్‌ రచ్చరచ్చ అయ్యింది.

డిసెంబర్‌ ఒకటిన జరిగే చంద్రబాబు టూర్‌ ఏర్పాట్ల కోసం సమావేశం నిర్వహించారు టీడీపీ ముఖ్యనేతలు. కొవ్వూరులో జరిగిన ఈ సమావేశానికి మాజీ మంత్రి జవహర్‌ రావడంతో ఒక్కసారిగా అలజడి రేగింది. జవహర్‌ ఎందుకొచ్చారంటూ ఆందోళనకు దిగింది ఆయన వ్యతిరేక వర్గం. జవహర్‌ వెళ్లిపోవాలంటూ పెద్దఎత్తున నినాదాలు చేయడంతో అనుకూల వర్గం ఎదురుదాడికి దిగింది. దాంతో, రెండు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయ్‌. ఆ తర్వాత, ఇరువర్గాలు తన్నులాటకు దిగడంతో పరిస్థితి పూర్తిగా అదుపుతప్పింది. జవహర్‌ అనుకూల, వ్యతిరేక వర్గాల అరుపులు కేకలతో దద్దరిల్లిపోయింది మీటింగ్‌ హాల్‌.

ఈ ఘటనతో అసలేం జరుగుతుందో తెలియక గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇబ్బందిపడ్డారు. ఇరువర్గాలకు కంట్రోల్‌ చేయడానికి నానా తంటాలు పడ్డారు ముఖ్యనేతలు. ఎంత ప్రయత్నించినా వినకపోవడంతో అర్ధాంతరంగా సమావేశాన్ని ముగించేసి వెళ్లిపోయారు గోరంట్ల. కొవ్వూరు టీడీపీలో కొన్నాళ్లుగా వర్గ విభేదాలు హీట్‌ పుట్టిస్తున్నాయ్‌. మాజీ మంత్రి జవహర్‌ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఫైటింగ్‌ జరుగుతోంది. అదిప్పుడు మరోసారి రచ్చకెక్కడంతో ఆందోళన చెందుతున్నారు కొవ్వూరు టీడీపీ కార్యకర్తలు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..