శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గ కేంద్రంలో అధికార వైసిపి,ప్రతిపక్ష టీడీపీ శ్రేణులు ఘర్షణకు దిగాయి. పట్టణ టిడిపి అధ్యక్షుడు నాగరాజు నివాసంకి వెళ్ళే మార్గంలోని కల్వర్టుని తొలగించేందుకు అధికారులు సిద్దమవ్వటంతో ఉద్రిక్తత నెలకొంది. సాయంత్రం నుండి కలవర్టు వద్ద బైఠాయించి టీడీపీ శ్రేణులు ఆందోళన చేస్తుండగా.. టీడీపీ ఎంపి రామ్మోహన్ నాయుడు ఘటన స్థలనాకి చేరుకున్నారు. ఆయన్ని పోలిసులు అడ్డుకోవడంతో పోలీసులకు, టీడీపీ శ్రేణులకు మద్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది.
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో రాజకీయాలు మరింత హీట్ ఎక్కుతున్నాయి. అధికార వైసిపి, ప్రతిపక్ష టీడీపీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. తాజాగా పలాస లోని ఏడో వార్డులో ఉద్రిక్తత నెలకొంది. శనివారం సాయంత్రం టీడీపీ, వైసిపి వర్గాలు కొట్లాటకు దిగాయి. టీడీపీ టౌన్ అధ్యక్షులు బి. నాగరాజు నివాసానికి వెళ్లే మార్గంలో కాల్వపై ఉన్న కల్వర్టును తొలగించేందుకు అధికారులు సిద్దం అవ్వటం ఉద్రిక్తతకు దారితీసింది. ఇరిగేషన్ కాలువపై నాగరాజు నిర్మించిన కల్వర్టు వల్ల దిగువకు సాగు నీరు పూర్తిస్థాయిలో వెళ్ళటం లేదనీ రైతుల నుండి అభ్యంతరాలు ఉన్నాయని అధికారులు చెబుతుండగా.. నీరు పోడానికి ఎటువంటి అడ్డులేదని.. పైగా అందరికీ కల్వర్టు ఉపయోగకరంగా ఉందని నాగరాజు చెబుతున్నాడు. ఇటీవల తాలపర్తి లో జరిగిన టీడీపీ సమావేశంలో మంత్రి సీదిరి అప్పలరాజుని తాను విమర్శించటంతో తనపై మంత్రి కక్ష సాధింపుతానే కల్వర్టు కూల్చేందుకు సిద్ధమవుతున్నారంటూ నాగరాజు ఆరోపిస్తున్నాడు.
విషయం తెలిసి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ గౌతు శిరీష, ఇచ్చాపురం టీడీపీ ఎమ్మెల్యే అశోక్, MLC చిరంజీవి రావు, పార్టీ నాయకులు ఘటన స్థలికి చేరుకుని నాగరాజుకు సంగీభావంగా ఆందోళనకి దిగారు. కల్వర్టుపైనే బయటాయించి నిరసన తెలుపారు. అయితే ఈ క్రమంలోనే పలువురు వైసిపి కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. కల్వర్టు నిర్మాణంపై తమకు అభ్యంతరం ఉందని దాన్ని తొలగించాలని వాదించారు. దీంతో టీడీపీ వాగ్వాదం చోటుచేసుకుని అది కాస్త కొట్లాటకు దారి తీసింది. పరిస్థితి ఉధృతంగా మారటoతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేశారు. భారీగా పోలీసులను మోహరించారు. మంత్రి అప్పలరాజుకు ఎన్నికల ముందు గ్రాఫ్ పడిపోతుండటంతో భయం పట్టుకొని తన ఉనికి కోసం తాపత్రయపడుతున్నారని ఈ సందర్భంగా శిరీష మండిపడ్డారు.
టీడీపీ శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ఘటనస్థలికి చేరుకోగా అర్ధరాత్రి వేళ మరోసారి ఉద్రిక్తత నెలకొంది. పలాస వదిన రామ్మోహన్ కరుణాచల కి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, ఎంపీకి మధ్య తీవ్రవాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఎంపీ.. పోలీసులను తోసుకుంటూ ముందుకు వెళ్ళగా..పార్టీ కార్యకర్త ఒకరు అస్వస్థతకు గురయ్యారు. పలువురు టీడీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా తన నియోజకవర్గంలో తాను తిరగకుండా పోలీసులు అడ్డుకోవడం ఏంటని మండిపడ్డారు. పోలీసులపై తాను లోక్సభలో లెటర్ పెట్టి కంప్లీట్ చేస్తానని హెచ్చరించారు. పలాసను పాకిస్తాన్ లా తయారు చేశారని మండిపడ్డారు.
మొత్తానికి అర్ధరాత్రి వరకు కల్వర్టు వద్ద హై డ్రామా నెలకొంది. దాదాపు అర్దరాత్రి ఒంటి గంట 30 నిమిషాల సమయంలో ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే అశోక్, గౌతు శిరీష లను అదుపులోకి తీసుకుని కల్వర్టును JCB తో తొలగించారు అధికారులు. ఈ క్రమంలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..