AP News: రూ.28 కోట్ల భారీ మోసం.. కొనసాగుతున్న సీఐడీ విచారణ

|

Oct 11, 2024 | 7:00 PM

చిలకలూరిపేట, నరసరావుపేటలోని ఐసీఐసీఐ బ్యాంకు మేనేజర్‌ నిర్వాకానికి ఖాతాదారులు నిండా మునిగారు. అయితే సీఐడీ విచారణలో అక్రమాల డొంక కదులుతోంది.రెండు బ్యాంకుల్లో నగదు, బంగారం మాయమైనట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. రెండో రోజు విచారణలో భాగంగా మరికొంత మంది ఖాతాదారుల నుంచి వివరాలు సేకరించారు.

AP News: రూ.28 కోట్ల భారీ మోసం.. కొనసాగుతున్న సీఐడీ విచారణ
Icici Bank Fraud
Follow us on

చిలకలూరిపేట, నరసరావుపేటలోని ఐసీఐసీఐ బ్యాంకు మేనేజర్‌ నిర్వాకానికి ఖాతాదారులు నిండా మునిగారు. పైసాపైసా కూడబెట్టి దాచుకున్న సొమ్ము ఖాతాల్లో లేదని తెలిసి షాక్‌ అయ్యారు. అయితే సీఐడీ విచారణలో అక్రమాల డొంక కదులుతోంది. రెండు బ్యాంకుల్లో నగదు, బంగారం మాయమైనట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. రెండో రోజు విచారణలో భాగంగా మరికొంత మంది ఖాతాదారుల నుంచి వివరాలు సేకరించారు.

ఖాతాదారులు చెప్పిన అంశాల ఆధారంగా అధికారులు రికార్డులు పరిశీలిస్తున్నారు. ప్రతిరోజు కొంతమంది ఖాతాదారులను పిలిచి అధికారులు విచారిస్తున్నారు. మరో 10 రోజులపాటు CID విచారణ కొనసాగే ఛాన్స్‌ ఉందని చెబుతున్నారు. మరోవైపు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బంగారు ఆభరణాలపై రుణాలు, ఇతర దేశాల నుంచి వచ్చిన నగదుపై CID అధికారుల ఆరా తీస్తున్నారు.

ఐసీఐసీఐ బ్యాంక్‌ నగదు గోల్‌మాల్‌ కేసులో అప్పటి మేనేజర్ నరేష్, అప్రైజర్‌ హరీష్‌ పాత్రపై సీఐడీ అధికారులు ఆరా తీస్తున్నారు.. ఇప్పటికే నరేష్‌, హరీష్‌పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. బ్యాంక్‌లో రూ.28 కోట్ల గోల్‌మాల్‌ జరిగిందని సీఐడీ ఏఎస్పీ ఆదినారాయణ తెలిపారు. ఈ ఘటనలో 72 మంది బాధితులు ఉన్నారని.. వారందరికీ న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. ఈ ఘటనలో ఎవరెవరి పాత్ర ఉందని దర్యాప్తు చేస్తున్నామన్న ఏఎస్పీ వీలైనంత త్వరగా కేసును ఛేదిస్తామన్నారు.