AP Crime News: చిత్తూరు టు భీమిలి.. వయా గుంటూరు.. పసిబిడ్డ కిడ్నాప్ కథ సుఖాంతం..

|

Mar 20, 2022 | 9:08 AM

Chittoor police Chased baby kidnap case: చిత్తూరు టు భీమిలి.. వయా గుంటూరు.. సీసీ కెమెరా విజువల్స్‌ ద్వారా కూపీ లాగితే నాలుగు రోజుల పసికందును ఎత్తుకెళ్లిన కిలాడీ లేడీ దొరికింది. చిత్తూరులో కనిపించకుండా పోయిన

AP Crime News: చిత్తూరు టు భీమిలి.. వయా గుంటూరు.. పసిబిడ్డ కిడ్నాప్ కథ సుఖాంతం..
Crime News
Follow us on

Chittoor police Chased baby kidnap case: చిత్తూరు టు భీమిలి.. వయా గుంటూరు.. సీసీ కెమెరా విజువల్స్‌ ద్వారా కూపీ లాగితే నాలుగు రోజుల పసికందును ఎత్తుకెళ్లిన కిలాడీ లేడీ దొరికింది. చిత్తూరులో కనిపించకుండా పోయిన పసిబిడ్డ క్షేమంగా తల్లి ఒడికి చేరింది. కేవలం 12 గంటల్లోనే నిందితులను ట్రేస్ చేసి పోలీసులు పట్టుకున్నారు. శనివారం తెల్లవారుజామున చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో నాలుగు రోజుల పసికందు కనిపించకుండా పోయింది. సీసీ కెమెరా విజువల్స్‌లో బిడ్డను ఎత్తుకెళ్తున్న ఓ మహిళ కనిపించింది. ఆ విజువల్స్‌ ఆధారంగా చిత్తూరు పోలీసులు తమదైన స్టయిల్‌లో విచారణ చేశారు. ఫోన్‌ సిగ్నల్స్‌తో మహిళను ట్రేస్‌ చేశారు. అలా బస్‌లో బిడ్డను ఎత్తుకెళుతున్న నిందితులను గుంటూరు పోలీసులు పట్టుకున్నారు. నల్లపాడు దగ్గర బస్‌ను ఆపి వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బిడ్డను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం పసికందు ఆరోగ్యం బాగున్నట్లు పోలీసులు తెలిపారు.

మగబిడ్డను ఎందుకు ఎత్తుకెళ్లారు, ఎక్కడికి తీసుకెళుతున్నారన్న దానిపై విచారణ చేస్తున్నారు. ఈ ఘటనలో పవిత్ర అనే మహిళ కీలకంగా ఉన్నట్లు తెలుస్తోంది. చిత్తూరులో ముందుగానే మకాం వేసి పక్కా ప్లాన్‌ ప్రకారం మగబిడ్డను ఎత్తుకెళ్లినట్లు విచారణలో తేలింది. చిత్తూరు ఆస్పత్రి నుంచి భీమిలికి బస్‌లో వెళ్లేలా ప్లాన్‌ చేసుకున్నారు నిందితులు. సీసీ కెమెరాల్లో చిక్కిన మహిళతోపాటు మరో మహిళ, ఇంకో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు గుంటూరు పోలీసులు. వారిని చిత్తూరు పోలీసులకు అప్పగించనున్నారు. మరోవైపు పసిబిడ్డను సేఫ్‌గా చిత్తూరులో ఉన్న తల్లి ఒడికి చేర్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ రోజు బిడ్డను తల్లి ఒడికి చేర్చనున్నారు.

Also Read:

AP Crime News: చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో శిశువు మాయం.. ఎత్తుకెళ్లిన కిలాడీ లేడి.. వీడియో

Chicken: భార్య చికెన్ వండలేదని డయల్ 100కు ఫోన్.. పోలీసులు ఏం చేశారో తెలిస్తే షాకవ్వాల్సిందే..

Thief Caught: దొంగలను ఇలా కూడా పట్టుకుంటారా..! ఆ పోలీసుల క్రేజీ ప్లాన్.. తెలుసుకుంటే షాకవుతారు..